బాలకృష్ణ సూపర్ హిట్ సినిమా నరసింహనాయుడు సినిమాతో తెలుగు వారికి పరిచయమైన ముద్దుగుమ్మ అశాషైనీ. ఈ సినిమాలో లక్స్ పాప అనే పాట ఈ సుందరికి ఎంతో గుర్తింపు తీసుకుని వచ్చింది. అయితే అవకాశాలు పెద్దగా రాలేదు. తరువాత అశాషైనీ మయూరీగా పేరు మార్చుకుంది. అయినా కాలం కలసి రాలేదు. కాగా ఈ భామ తాజాగా సెన్సార్ బోర్డులో సభ్యురాలిగా నియమించబడింది. సెన్సార్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేట్స్ (సిబిఫ్ సి) ఆశాను తమ సభ్యరాలిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
మరింత సమాచారం తెలుసుకోండి: