సామాన్యంగా అన్నదమ్ములు తమ అక్క చెల్లెళ్ళకు ‘రాఖీ’ కడుతూ ఉంటారు అయితే క్రేజీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ రాఖీ పండుగ చేసుకునే విధానం చాల వెరైటీగా ఉంటుంది.  తన తమ్ముడు అమన్ కు రకుల్ రాఖీ కట్టడమే కాదు తిరిగి అమన్ చేత రాఖీ కట్టించుకుంటుంది రకుల్.  ఈరోజు రక్షా బంధన్ సందర్బంగా రకుల్ తన తమ్ముడు అమన్ గురించి అదేవిధంగా తన కుటుంబ విషయాల గురించి అనేక ఆ శక్తికర విషయాలను ఈ రోజు ఒక ప్రముఖ దిన పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన తమ్ముడు అమన్ తో కలిసి షేర్ చేసుకుంది రకుల్.

సామాన్యంగా బ్రదర్స్ సిస్టర్స్ ని కాపాడుతూ ఉంటారని అయితే తన అక్క రకుల్ తనను కాపాడుతూ తనకు నిజమైన బాడీగార్డ్ లా మారిపోయి తన జీవితంలో ఎదుగుదలకు మార్గాలు వేస్తోంది అంటూ అమన్ తన అక్క రకుల్ ప్రీత్ పై సంచలన కామెంట్స్ చేసాడు.  అంతేకాదు 17 సంవత్సరాల వయస్సులో మోడల్ గా కెరియర్ ప్రారంభించి 19 ఏళ్లకే ఢిల్లీలో ఒక ఇల్లు కొనుక్కున్న రకుల్ ప్రీత్ పడే కష్టం చూస్తే ఎవరికైనా ముచ్చట వేస్తుంది అంటూ తన అక్కను ఆకాశంలోకి ఎత్తేశాడు అమన్.

అయితే రకుల్ మాత్రం తన తమ్ముడు గురించి అనేక విషయాలు షేర్ చేస్తూ రవితేజా నుండి ప్రకాష్ రాజ్ వరకు లక్ష్మి మంచు నుండి హ్యుమా ఖురేషీ వరకు ఇలా అందరు సెలెబ్రెటీలు తన తమ్ముడు వేసే జోక్స్ తో అతడి ఫ్యాన్స్ గా మారిపోయిన విషయాన్ని బయట పెట్టింది రకుల్.  అంతేకాదు తాను ఉండే హోటల్ లో పనిచేసే లిఫ్ట్ బాయ్ కూడ ‘హలో మేడమ్ అమన్ సార్ రాలేదా’ అంటూ తనను పలకరించడం చూస్తూ ఉంటే తాను సెలెబ్రెటీ యా లేక తన తమ్ముడు సెలెబ్రెటీ యా అన్న అనుమానం కలుగుతోంది అని తన తమ్ముడు పై సెటైర్లు వేసింది రకుల్.

తన తమ్ముడు అమన్ కు ఎన్ని సార్లు ఖరీదైన గిఫ్ట్స్ ఇచ్చినా ఆ గిఫ్ట్స్ అన్నీ అజాగ్రత్తతో పోగొట్టుకుంటున్న విషయాన్ని బయట పెడుతూ తన తమ్ముడు అమన్ కు డబ్బు విలువ ఇంకా తెలియడం లేదని అందుకే ఈసారి ఖరీదైన గిఫ్ట్ కొనకుండా చిన్న గిఫ్ట్ తో సరిపెడుతున్నాను అని కామెంట్స్ చేసింది రకుల్.  తన తమ్ముడుకు బ్లాక్ కలర్ అంటే చాల ఇష్టమని అయితే బ్లాక్ షర్ట్ వేసుకుని తన పక్కన నడుస్తూ ఉంటే అమన్ ను చూసి చాలామంది తనకు సెక్యూరిటీగా వచ్చిన బౌన్సర్ అనుకుంటున్నారని తమ్ముడు పై జోక్ చేసింది రకుల్.

ఇదే సందర్భంలో తామిద్దరం కలిసి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు తన తమ్ముడు అమన్ తనను తక్కువ మేకప్ వేసుకుని నీట గా ఉండే డ్రెస్ వేసుకోమని టార్చర్ పెడుతూ ఉంటాడన్న విషయాన్ని బయట పెట్టింది రకుల్.  అయితే తాను మాత్రం తన ఫేస్ తన ఇష్టం తన డ్రెస్ తన ఇష్టం అని అంటూ తన తమ్ముడుతో తగువులు పడ్డ అనేక సందర్భాలను గుర్తుకు చేసుకుంది.

ఇదే సందర్భంలో అమన్ రకుల్ గురించి మరొక షాకింగ్ విషయాన్ని బయట పెట్టాడు.  సున్నితంగా కనిపించే రకుల్ చాల డేంజరస్ అంటూ రకుల్ ఎవరైనా తేడాగా ప్రవర్తిస్తే పబ్లిక్ లోనే కొడుతుంది అంటూ రకుల్ తో ప్రవర్తించే వారికి ఈ ‘రక్షాబంధన్’  రోజున హెచ్చరికలు ఇస్తున్నాడు అమన్..  



మరింత సమాచారం తెలుసుకోండి: