అత్యంత భారీ హైక్ తో రేపు విడుదల కాబోతున్న ‘జనతా గ్యారేజ్’ ఒక విషయంలో మహేష్ ను సేవ్ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి.  ఈ మధ్య కాస్త గ్యాప్  తీసుకుని ఫ్యామిలీతో గడిపిన మహేష్ బాబు తిరిగి మురగదాస్ మూవీ సెట్స్ పైకి వచ్చాడు. చెన్నైలో నైట్ మోడ్ లో ఫస్ట్ షెడ్యుల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా షూటింగ్  ఇప్పుడు హైదరాబాద్ కు షిఫ్ట్ అయింది.  ఈ సినిమా షెడ్యుల్ లో భాగంగా సారధి స్టూడియోలో మహేష్, రకుల్ మరికొందరు పాల్గొంటున్న సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. 

అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది ఎన్టీఆర్ ‘జనతా గ్యారేజ్’ కోసం వేసిన సెట్ లోనే మహేష్ సినిమా షూటింగ్ జరుపుకుంటూ ఉండటం అందరికీ షాక్ ఇస్తోంది.  హైదరాబాద్ సారధి  స్టూడియోస్ లో ‘జనతా గ్యారేజ్’  షూటింగ్ చిత్రీకరించిన సెట్ లోనే ఆ సెట్ కు చిన్నచిన్న మార్పులు చేసి  మహేష్ సినిమాకోసం మురగదాస్ వాడుతున్నట్లు టాక్.  ఒక  యాక్షన్ సన్నివేశంతో పాటు పాటను కూడ ఇక్కడే చిత్రీకరించబోతున్నారట.  దీనితో భారీ బడ్జెట్ తో తీస్తున్న మహేష్ మురగదాస్ సినిమాను ‘జనతా గ్యారేజ్’ సేవ్ చేసింది అంటూ   సెటైర్లు  పడుతున్నాయి.

రాబోతున్న దసరాకి ఈ సినిమా టైటిల్ ని అనౌన్స్ చేయబోయే ఈ సినిమాకు మరింత క్రేజ్ తీసుకురావడానికి మురగదాస్ ఈ సినిమా టీజర్ ను ప్రత్యేకంగా రూపొందిస్తున్నాడు. అంతేకాదు ఈ టీజర్ కు సంబంధించిన  సీన్స్ ను ప్రత్యేకంగా షూట్ చేసి మముంబాయిలో ప్రత్యేకంగా గ్రాఫిక్ వర్క్స్ చేయించబోతున్నాడు అనే వార్తలు ఇప్పటికే  వచ్చాయి. 

మహేష్ జూనియర్ లు మంచి స్నేహితులు  అన్నవిషయం తెలిసిందే.  అయినా జూనియర్ నటించిన సినిమా సెట్ నే ఇప్పుడు కొంతవరకు మహేష్ వాడుకోబోతూ ఉండటం వీరిద్దరి సాన్నిహిత్యాన్ని సూచిస్తోంది అంటూ  కామెంట్స్ వినిపిస్తున్నాయి.  అయితే  ఏకంగా మహేష్ ‘శ్రీమంతుడు’  రికార్డులను బ్రేక్ చేయడానికి టార్గెట్ చేస్తు రేపు జూనియర్  ‘జనతా గ్యారేజ్’ విడుదలకాబోతు ఉండటం ఇక్కడి మరో  ట్విస్ట్.

ఈ వార్తలు ఇలా ఉండగా అన్ని గాసిప్ లకు చెక్ పెడుతూ విజయవాడలో ఈరోజు అర్ధరాత్రి  సమయంలో ‘జనతా గ్యారేజ్’ స్పెషల్ షో అనుమతులు లభించాయి.  విజయవాడ  గాంధీనగర్ లో గల రాజ్, యువరాజ్ కాంప్లెక్స్ లో ఉన్న యువరాజ్ ధియేటర్ లో సెప్టెంబర్ 1వ తేదీ మొదలవుతున్న  సమయంలో రాత్రి 1 గంటకు ‘జనతా గ్యారేజ్’  బెనిఫిట్ షో ప్రదర్శించడానికి అనుమతులు లభించాయి.

ఈ షోకు సంబంధించిన టికెట్ల ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ జూనియర్  అభిమానులు సందడి చేస్తున్నారు. ఇదే విధంగా గుంటూరు పరిసర  ప్రాంతాలలో కూడ  తెల్లవారు ఝామున నాలుగు గంటల ప్రత్యేక షోకి అనుమతులు లభిచడంతో పాటు ఈసినిమాకు సంబంధించి మల్టీప్లెక్స్ లలో అడ్వాన్స్ బుకింగ్స్ కూడా మంచి స్పీడ్ మీద ఉండటంతో ‘జనతా గ్యారేజ్’ ‘శ్రీమంతుడు’ రికార్డ్స్ ను బ్రేక్ చేయడం ఖాయం అని అంటున్నారు..  



మరింత సమాచారం తెలుసుకోండి: