ఈ మద్య సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు చూస్తుంటే సెలబ్రెటీలు బెంబేలెత్తిపోయిన సందర్భాలు చాలా వచ్చాయి. ముఖ్యంగా సెలబ్రెటీలు చనిపోయారన్న వార్తలు రావడం దాంతో అభిమానులు బాధతో వారికి వారి బంధువులకు తెగ ఫోన్లు చేయడం కామన్ అయ్యింది. గతంలో హాలీవుడ్ కుంగ్ ఫూ కింగ్ చాకీ చాన్ చనిపోయినట్లు వార్తలు రావడంతో వెంటనే స్పందించిన ఆయన నేను బతికే ఉన్న బాబోయ్ అంటూ ట్విట్ చేశాడు. ఆ మద్య తమిళ కమెడియన్ సెంథిల్ బాలీవుడ్ నటుడు ఖాదర్ ఖాన్ లాంటి వారు చనిపోయినట్లు వార్తలు రావడంతో వెంటనే వారు స్పందించి మేము బతికే ఉన్నామని ట్విట్ చేశారు.
తాజాగా ఇప్పుడు హాలీవుడ్ స్టార్ సిల్వస్టర్ స్టాలోన్ ఇంటర్నెట్కు బాధితుడయ్యాడు.హాలీవుడ్ హీరో సిల్వస్టర్ స్టాలోన్ మరణించాడని గత మూడు రోజుల క్రితం సోషల్ మీడియాలో వార్తలు వెలువడిన వార్తలు సంగతి తెలిసిందే. రాకీ బల్బోవా ఫిల్మ్ స్టార్ మృతిచెందినట్లు సీఎన్ఎన్ పేరుతో ఫేక్ రిపోర్ట్ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగింది.
ట్విట్టర్, ఫేస్బుక్లో ఆ వార్త శరవేగంగా విస్తరించింది. దీంతో వెంటనే స్పందించిన హాలీవుడ్ హీరో సిల్వస్టర్ స్టాలోన్ తాను ఆరోగ్యంగానే ఉన్నట్లు సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ కూడా చేశాడు. రష్యన్ బాక్సర్తో దిగిన ఓ ఫోటోను అప్లోడ్ చేశాడు. కూతురు సోఫియాతోనూ దిగిన మరో ఫోటోను కూడా సిల్వస్టర్ పోస్ట్ చేశాడు.