అపజయం ఎరుగని దర్శకుడు రాజమౌళి రూపొందిస్తున్న సినిమా ‘బాహుబలి’. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్, రానా, అనుష్క ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
కాగా, ఈ సినిమాలో ఒకప్పుడు తమిళ, తెలుగు, హిందీ సీమల్లో టాప్ హీరోయిన్ గా గుర్తింపబడి, అభిమానుల చేత ‘అతిలోక సుందరి’గా పిలుపించుకున్న శ్రీదేవి కూడా నటిస్తున్నట్లు తాజా సమాచారం.
ఈ ‘బాహుబలి’ సినిమాలో ప్రభాన్, రానా అన్నదమ్ముల్లుగా నటిస్తున్నారు. వీరికి తల్లిగా శ్రీదేవి నటిస్తున్నట్లు తెలుస్తుంది.
‘బాహుబలి’లో శ్రీదేవి నటించడం ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ తీసుకొస్తుందని అంతా భావిస్తున్నారు.
మరింత సమాచారం తెలుసుకోండి: