ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్రం బాహుబలి కి సంభందించిన వార్తలు ఏవో ఒకటి లేకుండా మీడియా లో రోజు గడవడం లేదు. ఈ చిత్రంలో బాహుబలికి తల్లిగా నటించడానికి మంచి గుర్తింపు ఉన్న మాజీ హీరోయిన్ కావాలని వెతుకుతున్న సంగతి తెలిసిందే. అది ఎవరు? అంటూ  పలురకాల ఊహాగానాలు విన్పిస్తున్నాయి.

తెలుగు,తమిళ,హిందీ భాషల్లో విడుదల కానుండటంతో మూడు చోట్ల తెలిసిన ఫేస్ కోసం వెతుకుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఆ పాత్రలో విశ్వసుందరిగా ఎన్నికై, రక్షకుడు చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సుస్మితాసేన్ నటించనుందని మరో వార్త మీడియా లోకి   వచ్చింది.  చాలా సంవత్సరాల క్రితం  నాగార్జున హీరోగా నటించిన ‘రక్షకుడు' చిత్రంలో  ఈమె  హీరోయిన్ గా కనిపించింది  ఆ తర్వాత సుస్మితకు ఎలాంటి అవకాశాలు తెలుగులో రాలేదు. దాదాపుగా సుస్మిత గురించి తెలుగు ప్రేక్షకులు మరిచిపోతున్న తరుణంలో ‘బాహుబలి' చిత్రంలో హీరో తల్లిగా నటించనుందన్న వార్తతో తెరపైకి వచ్చింది సుస్మిత.

దర్శకుడు సుస్మితకు చిత్రంలోని ప్రధాన కథను, ఆమె పాత్రలో విశిష్టతను చెప్పడంతో, దాదాపు కోటి రూపాయల పారితోషికాన్ని అడిగినట్లు సమాచారం.  అయితే కోటి రూపాయలు పెట్టి సుస్మితను తీసుకునే కన్నా తెలుగు, తమిళ భాషల్లో మంచి గుర్తింపు ఉన్న శ్రీదేవిని ఆ పాత్రకు ఎంపిక చేస్తే ఎలా ఉంటుందని, మరికొందరు సలహాలు ఇస్తున్నారట. శ్రీదేవి అయితే ఆ చిత్రానికి అదనపు ఆకర్షణ లభిస్తుందని కూడా వారు చెబుతున్నారట  ఐతే ఆ మధ్య శ్రీదేవి ఈ ప్రాజెక్ట్ లో లేదని దర్శకుడు రాజమౌళి ప్రకటించాడు  మొత్తానికి ‘బాహుబలి' తల్లి ఎవరు అనేది మాత్రం ఇంకా ఖరారు కాని విషయమే. తారల స్థాయి పెరుగుతున్న కొద్దీ ఈ సినిమా స్థాయి పెరిగి పోతూ  ఈ సినిమా ఫై అంచనాలు పెంచేస్తున్నాయి. ఏది  ఏమైనా మరో  సంవత్సరం   పాటు ఈ సినిమా గురించి ఇలా వార్తలు వస్తూనే ఉంటాయి ..

మరింత సమాచారం తెలుసుకోండి: