టాప్ హీరోలు అందరితోను సినిమాలు తీసిన పూరి జగన్నాథ్ బాలయ్య అభిమాన సంఘానికి అధ్యక్షుడుగా మారిపోతాను అంటూ తెలియ చేయడం షాకింగ్ న్యూస్ గా మారడమే కాకుండా బాలయ్య అభిమానులను విపరీతమైన జోష్ లో ముంచెత్తి వేస్తోంది. త్వరలో విడుదల కాబోతున్న ‘పైసా వసూల్’ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ లో భాగంగా నిన్న హైదరాబాద్ లో జరిగిన బాలకృష్ణ అభిమాన సంఘాల నాయకుల సమావేశంలో పూరి ఈ అభిప్రాయాన్ని వెల్లడించి అందరికీ షాక్ ఇచ్చాడు. 

అంతేకాదు తాను బాలయ్యకు వీరాభిమానిని అంటూ మరో షాక్ ఇచ్చాడు పూరిజగన్నాథ్. సెప్టెంబర్ 1న విడుదల కాబోతున్న ఈ మూవీకి భారీ ఓపెనింగ్స్ రాబట్టే దిశలో పూరి బాలయ్య అభిమానులు అందరికీ జోష్ ను కలిగిస్తూ ఈసినిమా పై భారీ అంచనాలు పెంచుతూ భారీ ఓపెనింగ్స్ పై కన్నేశాడు పూరి.  

సామాన్యంగా సినిమాలకు సంబంధించిన ఫంక్షన్స్ అన్ని మామూలుగా హైదరాబాద్‌లోనే జరుగుతుంటాయి.  అయితే తెలుగు ప్రజలు  రెండు రాష్ట్రాలుగా  విడిపోయిన తరువాత కొన్ని ఫంక్షన్స్ విజయవాడలోనూమరి కొన్ని తిరుపతి గుంటూరు విశాఖపట్నం లాంటి ప్రాంతాలలో జరుగుతున్నాయి. అయితే హైదరాబాద్ మినహా తెలంగాణా ప్రాంతానికి చెందినపట్టణాలలో సినిమా ఫంక్షన్స్ చాలా అరుదుగా జరుగుతున్నాయి. ఇది ఇలా ఉండగా 'పైసా వసూల్' టీం ఇప్పటిదాకా ఎవరూ ఆడియో వేడుక చేయని ప్రాంతాన్ని ఎంచుకుని అందరికీ షాక్ ఇచ్చింది. 

ఆంధ్రప్రదేశ్ తెలంగాణా రాష్ట్రాలకు సరిహద్దు జిల్లాగా పేర్కొనబడే  తెలంగాణ జిల్లా ఖమ్మంలో ఈ సినిమా ఆడియో వేడుక చేయబోతుండటం టాపిక్ అఫ్ ది  టాలీవుడ్ గా మారింది. ఇండిపెండెన్స్ డే సందడి ముగిశాక 17న ఖమ్మంలోని ఎస్ అండ్ బీజీఎన్ఆర్ కళాశాల మైదానంలో 'పైసా వసూల్' ఆడియో వేడుకను నిర్వహించ బోతున్నట్లు ప్రకటించారు. 

ఈ సినిమా విడుదలకు సరిగ్గా రెండు వారాల ముందు ఈ  ఆడియో ఫంక్షన్ జరప బోతున్న నేపధ్యం లో  ఈ సినిమా విడుదల ముందు ఈ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను ఈ నెలాఖరుకు విజవాడలో నిర్వహించే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.  గౌతమీ పుత్రా శాతకర్ణి సినిమా ఘన విజయం తరువాత విడుదల కాబోతున్న మూవీ కావడం త ఈమూవీ పై బాలయ్య అభిమానులు పెట్టుకున్న ఆశలను మరింత రెచ్చ గోడుతున్నాడు పూరిజగన్నాథ్.. మరింత సమాచారం తెలుసుకోండి: