తెలుగు ఇండస్ట్రీలో మహానటులు అక్కినేని నాగేశ్వరరావు తర్వాత ఆయన తనయుడు అక్కినేని నాగార్జున హీరోగా ఎంట్రీ ఇచ్చారు. మొదట లవర్ బాయ్ గా ఉన్నా..తర్వాత యాక్షన్, కామెడీ, ఫ్యామిలీ తరహా చిత్రాల్లో నటించారు. ఇండస్ట్రీలో నాగార్జునను మన్మధుడు, కింగ్ అని అభిమానులు పిలుస్తారు. శివ చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలో విలనీజానికి కొత్త ట్రెండ్ సృష్టించారని చెబుతారు. తన సహనటి అమలను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు నాగార్జున్. ప్రస్తుతం నాగార్జున వారసులుగా అక్కినేని నాగ చైతన్య, అఖిల్ హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు.

నాగచైతన్య ‘జోష్’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు..కానీ ఆ సినిమా అనుకున్నంతగా విజయం సాధించలేదు. ఆ తర్వాత గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ‘ఏం మాయ చేశావే’ చిత్రంతో అద్భుతమైన విజయం సాధించాడు. ఈ చిత్రంతో మళియాళీ భామ సమంత పరిచయం అయ్యింది. అయితే రీల్ లైఫ్ లోనే కాకుండా రియల్ లైఫ్ లో కూడా నాగచైతన్య, సమంతలు ప్రేమలో పడ్డారు.

ఇక ఆటోనగర్ సూర్య, మనం చిత్రంలో ఈ జంట నటించింది. ఇక తమ ప్రేమకు పెద్దల ఆశిస్సులు కూడా తోడయ్యాయి. రేపు (శుక్రవారం) నాగచైతన్య, సమంతల పెళ్లి. గోవాలో పెళ్లి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇప్పటికే చైతూ, సమంత అక్కడికి చేరుకొన్నారు. శుక్రవారం హిందూ సంప్రదాయం ప్రకారం, శనివారం క్రైస్తవ సంప్రదాయ ప్రకారం పెళ్లిళ్లు జరగనున్న సంగతి తెలిసిందే.

శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి మెహందీ కార్యక్రమం మొదలవుతుంది. రాత్రి 11 గంటల 52 నిమిషాలకు ముహూర్తం. శనివారం సాయిత్రం 5 గం. 30 నిమిషాల కు క్రైస్తవ సంప్రదాయ ప్రకారం పెళ్లి జరిపిస్తారు. ఈ పెళ్లికి అతిథులు వందమందే అని నాగ్ ముందే చెప్పాడు. హైదరాబాద్లోని ఎన్ కన్వెన్షన్లో రిసెప్షన్ ఏర్పాటు చేస్తారు. తేదీ, సమయం ఇంకా తెలియాల్సివుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:
samantha ruth prabhu
grand wedding
adorable moments
muhurtham
amala
goa
ap politics
telangana politics
ap political updates
telugu political news
latest news
latest ap updates
political news
indian politics
international news
national news
tollywood news
bollywood news
kollywood news
hollywood news
tollywood
latest film news
latest updates
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి