మరి కొన్ని గంటలలో జరగబోతున్న ‘అజ్ఞాతవాసి’ ఆడియో లాంచ్ వేదిక పై మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ పవన్ అభిమానులకు ఊహించని బహుమతి ఇవ్వబోతున్నాడు అన్న వార్తలు వస్తున్నాయి. పవన్ ఇప్పటి వరకు నటించిన సినిమాలలోని కొన్ని సూపర్ హిట్ సాంగ్స్ ను తీసుకుని తాను లైవ్ స్టేజ్ మీద పాడుతూ పవన్ బాడీ లాంగ్వేజ్ ని స్టెప్స్ ని అనుసరిస్తూ సుమారు ఒక గంటసేపు లైవ్ పర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నాడని టాక్.

ఇది ఇలా ఉండగా ఈరోజు సాయంత్రం జరగబోతున్న ఈ ఫంక్షన్ పాసులకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. కేవలం పవన్ అభిమానులు మాత్రమే కాకుండా హైదరాబాద్ లోని అనేక రాజకీయ పార్టీలకు సంబంధించిన నేతల కుటుంబాల నుండి అదేవిధంగా కొంతమంది పారిశ్రామిక వేత్తల అధికారుల కుటుంబ సభ్యులు కూడ ఈ మూవీ నిర్మాతల పై ఆడియో ఫంక్షన్ పాస్ లకు విపరీతమైన ఒత్తిడి చేయడంతో పవన్ అభిమానులకు ఇచ్చే పాసుల సంఖ్య బాగా తగ్గిపోయింది అని టాక్.

తెలుస్తున్న సమాచారం మేరకు ఇప్పటి వరకు ఈ ఫంక్షన్ కు అతిధులుగా ప్రచారంలోకి వచ్చిన జూనియర్ చిరంజీవిల పేర్లు కేవలం గాసిప్పులు మాత్రమే అన్న సంకేతాలను ‘అజ్ఞాతవాసి’ ఫిలిం యూనిట్ ఇస్తోంది. ఎటువంటి హడావిడి లేకుండా చాల నిరాడంబరంగా ఈ ఫంక్షన్ ను పూర్తిచేయమని పవన్ తమకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాడు అని ‘అజ్ఞాతవాసి’ నిర్మాతలు చెపుతున్నట్లు టాక్. బయటకు వస్తున్న వార్తల ప్రకారం ఈరోజు ఆడియో ఫంక్షన్ లో ఈసినిమాకు సంబంధించిన ధియేట్రికల్ ట్రైలర్ విడుదల లేదు అని అంటున్నారు.

కేవలం ఈ మూవీలోని పాటలు అన్నీ విడుదలచేసి ఉపన్యాసాలతో ఈ ఫంక్షన్ ను ముగిస్తారట. దీనికి కారణం ఈరోజు జరగబోతున్న ‘అజ్ఞాతవాసి’ ఆడియో ఫంక్షన్ హైక్ ఒక వారంరోజులు ఉంటుంది కాబట్టి ఈ హైక్ ను పూర్తిగా మరిచిపోకుండా మరింత కొనసాగించడానికి ఒక వారం గ్యాప్ తరువాత ‘అజ్ఞాతవాసి’ ట్రైలర్ విడుదల ఉంటుంది అని అంటున్నారు. ఏమైనా ఎటువంటి సంచలనాలు లేకుండా సాదాసీదాగా ఈ ఫంక్షన్ ను పూర్తిచేయమని పవన్ త్రివిక్రమ్ కు స్పష్టమైన సలహాలు ఇచ్చినట్లు టాక్..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి