ప్రపంచంలోని తెలుగువారు అంతా ఎంతో ఆనందంగా జరుపుకునే ఈ సంక్రాంతి లో కనిపించే కొన్ని ఆచార వ్యవహారాల వెనుక ఎంతో ఆధ్యాత్మిక రహస్యాలు ఉన్నాయి. అందంగా కనిపించే ముగ్గుల వెనుక ఓర్పును నేర్పే పాఠాలు ఉన్నాయి. ముగ్గుల మధ్య కనిపించే గొబ్బెమ్మ అసహ్యం నుంచి అద్భుతాలు సృష్టించవచ్చు అన్న విషయాలను తెలియ చేస్తుంది. గంగిరెద్దులు హరిదాసులు బిక్షానికి కూడ ఒక ధర్మం ఉంటుంది అన్న సంకేతాన్ని ఇస్తే జీవితం దారం వంటిది అన్న వేదాంతాన్ని స్పురింప చేస్తుంది గాలిపటం. కోడి పందాలు యుద్ధ నీతిని గెలిపించే మెళుకువలు నేర్పిస్తే మనకు నిరంతరం సేవ చేసిన వారికి కృతజ్ఞతలు తెలియచేసే పసుపూజలు కనుమ పండుగలో కనిపిస్తాయి.

 

మూడు రోజుల పెద్ద పండుగ వేడుకలలో  నేడు సంక్రాంతి పండుగ.  సూర్యుడు ఈరోజు మేషంతో పాటు ఇతర రాశులందు క్రమంగా ప్రయాణంచేసి పూర్వరాశి నుంచి ఉత్తర రాశిలోకి ప్రవేశించడంతోనే సంక్రాంతి పండుగ ప్రారంభమౌతుంది. సంవత్సరానికి పన్నెండు నెలలలోనూ సంక్రాంతులుంటాయి. కాని పుష్యమాసం హేమంత ఋతువులో సూర్యుడు ధనస్సు రాశినుంచి మకరరాశిలోకి ప్రవేశించగానే వచ్చే మకర సంక్రాంతికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. 


సూర్యుడు దక్షిణాయణంనుంచి ఉత్తరాయణంలోకి ప్రవేశించే ఈ రోజునుంచే వైకుంఠంలో స్వర్గద్వారాలు తెరిచివుంటాయని పురాణాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఈరోజున పితృదేవతలకు తర్పణాలు ఇస్తారు.రాష్ట్రవ్యాప్తంగా గంగిరెద్దులను అలంకరించి ఇంటింటికి తిప్పుతూ డోలూ సన్నాయి వాయిస్తూ గంగిరెద్దులవారు తిరుగుతుంటారు. ఈ రోజు ప్రతి ఒక్కరు ఆనందోత్సాహాల నడుమ ఈ పండుగను జరుపుకుంటారు. ముఖ్యంగా మనుషుల మధ్యనున్న భేదాభిప్రాయాలు, మనస్పర్థలు తొలగించుకోవడానికి ఈపండుగలనే పేరుతో అందరూ కలసిమెలిసి ఆనందంగా గడుపుకోవడమే ప్రధాన ఉద్దేశ్యం. ఈ పండుగను  మన దేశంలోని  వివిధ రాష్ట్రాల్లో  వివిధ పేర్లతో జరుపుకుంటారు. మన తెలుగు రాష్ట్రాలు అయిన ఆంధ్రప్రదేశ్ ,తెలంగాణ ,కర్ణాటక రాష్ట్రాల్లో ఈ పండుగని  సంక్రాంతి అని జరుపు కుంటే  తమిళనాడులో పొంగల్ పంజాబ్ లో లోహిరి రాజస్థాన్ గుజరాత్ రాష్ట్రాల్లో ఉత్తరయన్ అని పిలుస్తారు.

 SANKRANTHI FESTIVAL PHOTOS కోసం చిత్ర ఫలితం

ఈపండుగను కేవలం మన దేశంలోనే కాక మన పొరుగు దేశాలైనటువంటి బర్మా, నేపాల్, థాయిలాండ్ దేశాల్లో కూడా జరుపుకుంటారు.ఈ పండుగ యొక్క ప్రత్యేకత ఏమిటంటే నెల రోజుల ముందునుండే పండగ హడావిడి మొదలవుతుంది.ప్రతి ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు ,గొబ్బమలతో స్వాగతం పలుకుతాయి. వేకువ జామున హరినామ సంకిర్తనలతో హరిదాసు నెలంతా వస్తూ ప్రజలను భక్తి మార్గంలోకి మళ్ళిస్తాడు. అంతేకాకుండా ఇంటి కుటుంబ సభ్యులు అంతా ఎక్కడున్నా సరే ఈపండుగ సమయానికి అందరు తమ సొంత ఊరికి వెళ్లి తమ కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ప్రపంచంలోని తెలుగు వారంతా అత్యంత ఆనందాత్సోహాలతో జరుపుకుంటున్న ఈ సంక్రాంతి పండుగ రోజున ఇండియన్ హెరాల్డ్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియచేస్తోంది..

 


మరింత సమాచారం తెలుసుకోండి: