తెలుగు ఫిలిం ఇండస్ట్రీని ఒక కుదుపు కుదిపిన క్యాస్టింగ్ కౌచ్ వ్యవహారం పై టాప్ యంగ్ హీరోలు ఎవ్వరూ ఎందుకు మాట్లాడటం లేదు అన్న విమర్శలకు రామ్ చరణ్ చాల ఆలస్యంగా స్పందిస్తూ ఎట్టకేలకు క్యాస్టింగ్ కౌచ్ పై రియాక్ట్ అయ్యాడు. ఇండస్ట్రీలో తన సొంత చెల్లెలతో పాటు తన చెల్లెళ్ళు లాంటి ఎందరో పనిచేస్తున్న నేపధ్యంలో ఇలాంటి సమస్యలను ఎదుర్కొనడంలో పరిశ్రమ మరింత స్ట్రాంగ్ గా ఉండాలని సూచించాడు. 
RAMCHARAN LATEST MEDIA INTERVIEW PHOTOS కోసం చిత్ర ఫలితం
రామ్ చరణ్ శ్రీరెడ్డి పేరును నేరుగా ప్రస్తావించకుండా క్యాస్టింగ్ కౌచ్ వ్యవహారం పై మాట్లాడటం ఇప్పుడు టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. రాజకీయాలు వ్యాపారం సినిమాలు ఇలా ఏరంగంలో అయినా క్యాస్టింగ్ కౌచ్ అన్న పద్ధతి మంచిది కాదు అని చెపుతూ తన కుటుంబం  నుండి తన సిస్టర్స్ కూడ ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి తాను మరింత జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఏర్పడింది అన్న అభిప్రాయాన్ని చరణ్ వ్యక్త పరిచాడు. 
RAMCHARAN LATEST MEDIA INTERVIEW PHOTOS కోసం చిత్ర ఫలితం
అయితే నిజాలు నిర్ధారించకుండా నిర్ణయాలు తీసుకోవడం మంచిదికాదు అని చెపుతూ క్యాస్టింగ్ కౌచ్ వ్యవహారం పై మా అసోసియేషన్ ఒక కమిటీని ఏర్పాటు చేసింది కాబట్టి ఆకమిటీ నిజాలు తేల్చేవరకు వేచి ఉండటం మంచిది అని అంటూ ఆ కమిటీ చెప్పబోయే నిర్ణయాలకు తన మద్దతు పూర్తిగా ఉంటుంది అన్న విషయాన్ని తెలియచేసాడు చరణ్. అయితే ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్న తన కుటుంబ మహిళల భద్రత గురించి తాను ప్రతిరోజూ పట్టించుకోలేనని అదేవిధమైన పరిస్థితి అందరికీ ఉంటుంది అంటూ ఆసక్తికర కామెంట్స్ చేసాడు ఈ మెగా యంగ్ హీరో.
RAMCHARAN LATEST MEDIA INTERVIEW PHOTOS కోసం చిత్ర ఫలితం
అయితే క్యాస్టింగ్ కౌచ్ పై నియమింపబడ్డ కమిటీ స్ట్రాంగ్ గా ఉంటే అన్నిసమస్యలు వాటంతట అవే తీరిపోతాయని కామెంట్ చేస్తూ ఇండస్ట్రీలో పనిచేసే ప్రతి వ్యక్తికి ఒక నిబద్ధత ఉండాలి అన్న అభిప్రాయాన్ని చరణ్ వ్యక్త పరుస్తున్నాడు. ముఖ్యంగా ఇండస్ట్రీలో ఇద్దరు వ్యక్తులు కలిసి పనిచేస్తున్నప్పుడు మరీ ముఖ్యంగా ఓ మహిళతో కలిసి వర్క్ చేస్తున్నప్పుడు ఇది మన కుటుంబం అనే ఫీలింగ్ లేకుండా పని చేస్తే ఇలాంటి సమస్యలే వస్తాయి అంటూ చరణ్ కామెంట్ చేస్తున్నాడు. అయితే చరణ్ ఈ వ్యవహారం పై ఇంత ఆలస్యంగా నిద్రలేచి ఇప్పుడు ఎందుకు స్పందించాడు అన్నది సమాధానం లేని ప్రశ్న..  


మరింత సమాచారం తెలుసుకోండి: