ఈమధ్య కాలంలో హీరోల‌కు నెగిటీవ్ పాత్ర‌ల‌పై మోజు మళ్ళింది. రజనీకాంత్ ‘2.0’ లో అక్షయ్ కుమార్ విలన్ పాత్రలో నటిస్తే గత ఏడాది విడుదల అయిన `జై ల‌వ‌కుశ‌`లో ఎన్టీఆర్ ప్ర‌తినాయ‌కుడి ఛాయ‌లున్న పాత్ర‌లో కనిపించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రాజ‌మౌళి తీస్తున్న ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీలో కూడ ఎన్టీఆర్ నెగిటివ్ షేడ్స్ ఉన్న హీరో పాత్రను పోషిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

ఇప్పుడు ఇదే తరహా ఆలోచనలు మెగా యంగ్ హీరో వరుణ్ తేజ్ కు వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. తెలుస్తున్న సమాచారం మేరకు వరుణ్ తేజ్ త‌మిళంలో ఘ‌న విజ‌యంసాధించి విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకున్న మూవీ ‘జిగ‌ర్తాండ‌’ తెలుగు రీమేక్ కు లైన్ క్లియర్ చేసినట్లు తెలుస్తోంది. 

సిద్దార్థ్ హీరోగా న‌టించిన ఈమూవీ ‘చిక్కడు దొరకదు’ పేరుతో తెలుగులో డబ్ చేయబడింది. అయితే చాలామందికి ఆ డబ్బింగ్ సినిమా ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు వెళ్లిందోతెలియని పరిస్థితి. ఈమూవీలో సిద్ధార్థ్ హీరోగా నటించినా ఈమూవీ వల్ల పేరు మొత్తం ప్ర‌తినాయ‌కుడిగా క‌నిపించిన బాబీ సింహాకు వెళ్లింది. 

‘పిజ్జా’ మూవీని డైరెక్ట్ చేసిన కార్తీక్ సుబ్బరాజ్ ఈమూవీని డైరెక్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈమూవీ తెలుగులో ఇప్పటికే డబ్ అయి విడుదలైనా ఆ విషయాన్ని పట్టించుకోకుండా దర్శకుడు హరీష్ శంకర్ ఇప్పుడు ఈమూవీని కొన్ని మార్పులతో తెలుగులో రీమేక్ చేసే ఆలోచనలతో ఈమూవీలోని విలన్ పాత్ర కోసం వరుణ్ తేజ్ ను అడగడం అతడు అంగీకరించడం జరిగింది అన్న వార్తలు వస్తున్నాయి. దీనితో వరుణ్ తేజ్ కూడ నెగిటివ్ పాత్రల వైపు అడుగులు వేస్తున్నాడు అంటూ కామెంట్స్ వస్తున్నాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి: