టాలీవుడ్ లో స్టార్ ప్రొడ్యూసర్ గా ఎన్నో ప్రతిష్టాత్మక సినిమాలు తీశారు డి రామానాయుడు.   తెలుగు, తమిళ, హిందీ భాషల్లో పలు సినిమాలు తీసిన ఆయకు దాదా ఫాల్కె అవార్డు ఇచ్చి సత్కరించిన విషయం తెలిసిందే.  ఆయన తనయులు డి సురేష్ బాబు స్టార్ ప్రొడ్యూసర్ గా కొనసాగుతున్నారు.  ఆయర రెండవ కుమారుడు దగ్గుబాటి వెంకటేష్ ‘కలియుగ పాండవులు’సినిమాతో హీరోగా వెండి తెరకు పరిచయం అయ్యారు. అప్పటి నుంచి ఎన్నో యాక్షన్ సినిమాల్లో నటించిన ఆయన తర్వాత ఫ్యామిలీ తరహా సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించారు. 

Image result for venkatesh daggubati engagement

ప్రస్తుతం పలు మల్టీస్టారర్ సినిమాల్లో నటిస్తున్నారు వెంకటేష్.  తాజాగా దగ్గబాటి వెంకటేష్ ఇంట్లో పెళ్లి బాజా మోగనుంది.  వెంకటేష్ కూతురు అశ్రితకి పెళ్లి జరగనున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ రేస్ క్లబ్ కి అధిపతి ఆర్.సురేందర్ రెడ్డి మనవడిని వెంకీ అల్లుడు చేసుకోబోతున్నాడు. ఇటీవల నిశ్చితార్థం చాలా నిడారంబరంగా సీక్రెట్ గా కానిచ్చేశారు.  అసలు వెంకటేష్ కూతరు నిశ్చితార్థం ఓ రేంజ్ లో ఉండబోతుందని మీడియా అంతా ఫోకస్ చేశారు..కానీ నిశ్చితార్ధం కూడా చాలా సైలెంట్ గా కానిచ్చేశారు. దానికి సంబంధించి ఒక్క ఫోటో కూడా బయటకి రానివ్వలేదు.  ఇక పెళ్లి విషయంలో కూడా ఇదే రిపీట్ అవ్వబోతుందా..ఇప్పటికే  రాజస్థాన్ లోని పెళ్లి ఏర్పాట్లు మొదలైపోయాయి.

Image result for venkatesh daggubati engagement

అయితే పెళ్లికి  దగ్గుబాటి కుటుంబానికి చెందినా అత్యంత సన్నిహితులు, టాలీవుడ్ లోని కొందరు ముఖ్యమైన సెలబ్రిటీలకు మాత్రమే ఆహ్వానం అందినట్లు తెలుస్తోంది. సంగీత్ కోసం రానా, చైతు, సమంత హడావిడి చేయడానికి రెడీ అవుతున్నారు. పెళ్లి పూర్తయిన తరువాత హైదరాబాద్ లో ఘనంగా రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారు. కాకపోతే రిసెప్షన్ మాత్రం చాలా గ్రాండ్ గా చేయబోతున్నట్లు సమాచారం. దీనికి టాలీవుడ్, బాలీవుడ్  సెలబ్రిటీలు అందరూ హాజరవుతారని తెలుస్తోంది.   

మరింత సమాచారం తెలుసుకోండి: