ఈవారం సల్మాన్ ఖాన్ ‘భరత్’ విడుదల అవుతున్నా ఆ మ్యానియాను లెక్క చేయకుండా విడుదల కాబోతున్న ‘7’ మూవీ పై అంచనాలు ఉన్నాయి. ఈమూవీలో ఆరుగురు హీరోయిన్స్ తో పాటు ఆరు లిప్ లాక్ సీన్స్ ఉన్నాయి. సాధారణంగా ఒక సినిమాలో ఒక డీప్ లిప్ లాక్ సీన్ ఉంటే ఆమూవీ గురించి యూత్ లో క్రేజ్ ఉంటుంది.

ఇప్పుడు ఏకంగా ఈమూవీలో ఆరు డీప్ లిప్ లాక్ సీన్స్ ఉన్నాయి అని ఈమూవీ దర్శకుడు నిజార్ షఫీ చెపుతున్నాడు. సినిమాటోగ్రాఫర్ గా ‘భలే భలే మగాడివోయ్’ ‘నేను లోకల్’ ‘మహానుభావుడు’ ‘శైలజా రెడ్డి అల్లుడు’ చిత్రాలకు పని చేసిన నిజార్ షఫీ దర్శకుడిగా ఈమూవీ ద్వారా పరిచయం కాబోతున్నాడు. 

ఇప్పటి వరకు ఎంతో మంది సినిమాటోగ్రాఫర్స్ దర్శకులుగా తమ వంతు ప్రయత్నాలు చేసినా ఎవరు పెద్దగా రాణించ లేకపోయారు. అయితే ఆరుగురు హీరోయిన్స్ ఒక హీరోతో కలిసి తీసిన ఈమూవీ కథ చాల విభిన్నం అని తెలుస్తోంది. హవీష్ హీరోగా నటిస్తున్న ఈమూవీ కథ ఒక మర్డర్ మిస్టరీ చుట్టూ తిరుగుతుంది.  

ఒక మర్డర్ కేసులో భాగంగా ఆరుగురు అమ్మాయిలు మరియు హవీష్ ను పోలీసులు అనుమానించి ఎంక్వైరీకి పిలుస్తారు. ఈ సినిమాలో రెజీనాతో పాటు మరో ఐదుగురు హీరోయిన్స్ తో నటించడమే కాకుండా వీరందరితోను ఆరు లిప్ లాక్ సీన్స్ ను దర్శకుడు క్రియేట్ చేసాడు. సాధారణంగా సినిమాలో ఆరు పాటలు ఉంటాయి. దీనికి భిన్నంగా ఆరు లిప్ లాక్ సీన్స్ ను క్రియేట్ చేసి ఈమూవీకి క్రేజ్ తీసుకు రావాలని దర్శకుడు నిజార్ షఫీ చేస్తున్న ప్రయత్నాలకు యూత్ ఎలా కనెక్ట్ అవుతారో చూడాలి..    



మరింత సమాచారం తెలుసుకోండి: