మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సైరా సినిమా షూటింగ్ తుది దశకు చేరుకుంది. త్వరలో విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ సినిమా తర్వాత కొరటాల తో చేయబోయే సినిమా కోసం చిరంజీవి కొత్త లుక్ లో కనబడుతున్నట్లు ఫిలింనగర్ టాక్. ముఖ్యంగా ఈ సినిమా కోసం కథ పరంగా చిరంజీవి బరువు తగ్గాలని కొరటాల శివ సూచించడంతో సినిమా నిర్మాత రామ్ చరణ్ తన తండ్రి చిరంజీవి బరువు తగ్గడం కోసం బాలీవుడ్ ఇండస్ట్రీ కండలవీరుడు సల్మాన్ ఖాన్ ని సంప్రదించారట.


సల్మాన్ కి చిరంజీవి మరియు రామ్ చరణ్ అన్న ప్రత్యేకమైన అభిమానం ఉంది. ఈ నేపథ్యంలో సల్మాన్ ఖాన్ చిరంజీవి కోసం తనకు వ్యక్తిగతంగా ఉండే ట్రైనర్ ని రెండు నెలలపాటు చిరంజీవికి ట్రైన్ చేయమని హైదరాబాద్ కి పంపించారట. చిరంజీవి కుటుంబం అంటే సల్మాన్ ఖాన్ కి ప్రత్యేకమైన అభిమానం ఉంది.


గతంలో చిరంజీవి కోడలు రామ్ చరణ్ భార్య ఉపాసన నిర్వహిస్తున్న హెల్త్ మ్యాగజైన్ కు సల్మాన్ స్పెషల్ ఇంటర్వ్యూ కూడా ఇవ్వడం జరిగింది. అయితే తాజాగా రామ్ చరణ్ అడగటంతో తన ట్రైనర్ ని చిరంజీవి కి రెండు నెలల పాటు ట్రైన్ చేయాలని ముంబై నుండి సల్మాన్ పంపించడంతో మరొకసారి చిరంజీవి కుటుంబం పై తనకున్న అభిమానాన్ని బయటపెట్టడం జరిగింది. ప్రస్తుతం ఈ వార్త బాలీవుడ్ ఇండస్ట్రీ లో టాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: