‘సాహో’ నిడుదలకు ఇక ఒక నెల మాత్రమే మిగిలి ఉన్న నేపధ్యంలో ఈమూవీకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు చాల వేగంగా జరుగుతున్నాయి. ఈమూవీని అనేక భాషలలో ఒకేసారి అత్యంత భారీగా విడుఅల చేస్తున్న పరిస్థుతులతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఈమూవీ ప్రింట్లు పంపవలసి ఉన్న పరిస్థుతులలో ఈమూవీ పనులను చివరి నిముషం టెన్షన్ లేకుండా పది రోజులు ముందుగానే పూర్తి చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. 

ఈ పరిస్థుతుల నేపధ్యంలో ఈమూవీ ఎడిటింగ్ పనులు వేగవంతం చేసి ఈమూవీకి సంబంధించిన తొలి సగాన్ని లాక్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పుడు ఈతొలి సగం నిడివి గంటా ఇరవై నిమిషాలు వచ్చినట్లు తెలుస్తోంది. ఇంకా ఈమూవీ పోస్ట్ ఇంటర్వెల్ భాగం ఎడిటింగ్ దశలో ఉన్న పరిస్థితులలో ఈమూవీ ఎడిటింగ్ పూర్తి చేసుకునే సరికి ఈమూవీ నిడివి రెండు గంటల రెండుగంటల నలభై నిమిషాలు దాటిపోతుంది అని అంటున్నారు.

దీనితో ఇంత నిడివి ఉన్న సినిమాలను ప్రస్తుతం ప్రేక్షకులు చూడటానికి అసహనం వ్యక్తపరుస్తున్నారు కాబట్టి ఈమూవీ నిడివిని కనీసం పది నిముషాలు అయినా తగ్గించమని ప్రభాస్ స్పష్టమైన సూచనలు ఇచ్చినట్లు టాక్. అయితే ఇలా నిడివి తగ్గించడం వల్ల సినిమా సీన్స్ లో కనెక్టివిటీ లోపం రాకుండా చూసుకోవాలని కూడ ప్రభాస్ మధన పడుతున్నట్లు తెలుస్తోంది. 

ఇది ఇలా ఉండగా సుమారు 200 కోట్ల భారీ బడ్జెట్ తో ఈమూవీని తీసినా ఈమూవీని లెక్క చేయకుండా అక్షయ కుమార్  ‘మిషన్ మంగళ్’ జాన్ అబ్రహాం హీరోగా నటించిన ‘బాట్లా హౌస్’ ‘సాహో’ ను టార్గెట్ చేస్తూ విడుదల కావడం ప్రభాస్ కు విపరీతమైన టెన్షన్ ను కలిగిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇది చాలదు అన్నట్లుగా బాలీవుడ్ హీరో జాన్ అబ్రహం ఈమధ్య ఒక బాలీవుడ్ మీడియా సంస్థతో మాట్లాడుతూ ‘సాహో’ ను తక్కువ చేసే అర్ధంలో చేసిన కామెంట్స్ ను బట్టి బాలీవుడ్ హీరోలు ప్రభాస్ ను లైట్ గా తీసుకుంటున్నారా అన్న సందేహాలు కలుగుతున్నాయి..   


మరింత సమాచారం తెలుసుకోండి: