మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా మాస్ సినిమాల దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ వాల్మీకి, నేడు ఎన్నో అంచనాలతో ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మాతలుగా వ్యవహరించిన ఈ సినిమాలో వరుణ్ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటించింది. ఇటీవల తమిళ్ లో రిలీజ్ అయి మంచి హిట్ సాధించిన జిగర్తాండ అనే సినిమాకు అఫీషియల్ రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమాపై టాలీవుడ్ ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.
అయితే నిన్న ఈ సినిమా టైటిల్ గా వాల్మీకిని తొలగించాలని హై కోర్ట్ ఉత్తర్వులు జారీ చేయడంతో, సినిమా యూనిట్ ఈ సినిమా టైటిల్ ని గద్దలకొండ గణేష్ గా మార్పు చేస్తున్నట్లు నిన్న రాత్రి ప్రకటించింది. ఇక మంచి అంచనాలతో నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు తెల్లవారుఝామున ప్రీమియర్ షో ల నుండి సక్సెస్ఫుల్ టాక్ లభించినట్లు సమాచారం. ఇకపోతే ఈ సినిమా మొదటి షో ఫస్ట్ హాఫ్ కాసేపటి క్రితం పూర్తి కావడంతో ఫస్ట్ హాఫ్ ఎంతో బాగుందని అంటున్నారు ప్రేక్షకులు. గద్దలకొండ గణేష్ గా వరుణ్ తేజ్, ఫస్ట్ హాఫ్ మొత్తం సింగల్ హ్యాండ్ తో దున్నేశాడనేది ప్రముఖంగా వారు చెప్తున్న మాట. అయితే ఈ సినిమాలో మరొక ముఖ్య పాత్రలో నటించిన తమిళ నటుడు అథర్వ మురళి క్యారెక్టర్ బాగున్నప్పటికీ అతడికి తెలుగు డబ్బింగ్ చెప్పిన హేమంచంద్ర వాయిస్ మాత్రం అసలు బాలేదని,
థియేటర్ లో అయన క్యారెక్టర్ కు ఆ వాయిస్ అసలు సెట్ కాలేదని మెజారిటీ ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు. ఇక మరోవైపు వినపడుతున్న వాదన ఏంటంటే, ఎక్కువగా హరీష్ శంకర్ సినిమాలు ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటాయని, కానీ సెకండ్ హాఫ్ దగ్గరే కొంత తేడాకొడుతుంటాయనేది వారు చెప్తున్న మాట. మరి ఇంకాసేపు గడిస్తేనేకాని ఈ సినిమా యొక్క పూర్తి టాక్ బయటకు వచ్చే అవకాశం లేదు. అయితే ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి వస్తున్న పాజిటివ్ బజ్ ని బట్టి చూస్తుంటే ఒకరకంగా వరుణ్ మంచి సాధించే అవకాశాలు కనపడుతున్నాయి. అయితే చూడాలి మరి ఏమి జరుగుతుందో.....!!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి