-
Ala Vaikuntapuramlo
-
Ala Vaikunthapurramloo
-
ala venkatapuram lo
-
anil music
-
anil sunkara
-
CBN
-
Cinema
-
Darsakudu
-
devi sri prasad
-
Director
-
festival
-
Film Nagar
-
January
-
Kurnool
-
Mahesh
-
Makar Sakranti
-
media
-
News
-
Posters
-
Rajani kanth
-
rashmika mandanna
-
sankranthi
-
Sankranti
-
Sunkara Ramabrahmam
-
Tollywood
-
you tube
-
Youtube
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న లేటెస్ట్ సినిమా సరిలేరు నీకేవ్వరు ఇప్పటికే డెబ్భై శాతానికి పైగా షూటింగ్ ని జరుపుకుని సంక్రాంతి కానుకగా అన్ని విధాలా రిలీజ్ కి సిద్దమవుతోందని, ఈ సినిమా నిర్మాతల్లో ఒకరైన అనిల్ సుంకర ఇప్పటికే ఒక మీడియా ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ చెప్పడం జరిగింది. మహేష్ సరసన రష్మిక హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను కర్నూలు బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు అనిల్. కెరీర్ పరంగా ఇప్పటివరకు ఒక్క ఫ్లాప్ కూడా లేని అనిల్ రావిపూడి, ఈ సినిమాను కూడా సూపర్ హిట్ చేసి, మరింత పేరు సంపాదించాలని చూస్తున్నారు. సీనియర్ నటి విజయశాంతి ఈ సినిమా ద్వారా టాలీవుడ్ రీఎంట్రీ ఇస్తుండడంతో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి.
ఇక ఇటీవల రీరిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ మరియు టీజర్లకు ప్రేక్షకుల నుండి మంచి స్పందన రావడంతో పాటు సినిమాపై అంచనాలు కూడా భారీగా పెరిగాయి. ఇకపోతే ఈ సినిమా ప్రమోషన్ ని మరికొద్దిరోజుల్లో షురూ చేయబోతోందట సినిమా యూనిట్. ఇప్పటికే ఈ సినిమాతో పాటే జనవరి 12న రిలీజ్ అవుతున్న అల వైకుంఠపురములో సినిమా యూనిట్, ఒక సాంగ్ ని రిలీజ్ చేసి, రెండవ సాంగ్ ని కూడా త్వరలో రిలీజ్ చేసేందుకు సిద్ధం అవుతుండడంతో, సరిలేరు టీమ్ కూడా తమ సినిమా ప్రమోషన్స్ ని పక్కాగా ప్లాన్ చేసినట్లు సమాచారం. అయితే కొన్ని ఫిలిం నగర్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం,
దీపావళి నాడు ఈ సినిమా ప్రమోషన్స్ ప్రారంభం అవుతాయని, ఆ తరువాత నుండి సినిమాలోని ఒక్కొక్క సాంగ్ ని యూట్యూబ్ లో రిలీజ్ చేస్తారని అంటున్నారు. మహేష్ బాబు మిలిటరీ మేజర్ గా నటిస్తున్న ఈ సినిమాలో సంగీత, బండ్ల గణేష్, హరి తేజ, మురళి శర్మ, రాజేంద్ర ప్రసాద్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తుండగా, రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న వార్త ప్రకారం ఈ సినిమా ప్రమోషన్ అతి త్వరలో మొదలైతే మాత్రం సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి పండుగ మొదలైనట్లే....!!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి