దసరా ను టార్గెట్ చేస్తూ విడుదలైన ‘సైరా’ దీపావళి వచ్చే సరికి తన టోటల్ రన్ ను పూర్తి చేసుకుని ఇక ధియేటర్ల నుండి సెలవు తీసుకోవడానికి సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా పేరుకు నాన్ బాహుబలి రికార్డులను తెలుగు రాష్ట్రాలలో సాధించినా ఈ మూవీ కలక్షన్స్ బయ్యర్లకు ఏమాత్రం దీపావళి ఆనందాలు కలిగించలేదు అన్న వార్తలు వస్తున్నాయి.

తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఒక్క ఉత్తరాంధ్ర ప్రాంత బయ్యర్ కు తప్ప ప్రతి ప్రాంతంలోను ఈ మూవీని కొనుక్కున్న బయ్యర్లకు తీవ్ర నష్టాలు వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. మొదట్లో తమకు నష్టాలు వచ్చాయి అని చెప్పడానికి కూడ భయపడిన బయ్యర్లు ఇప్పుడు ఒకొక్కరుగా తమకు ‘సైరా’ తో నష్టాలు వచ్చాయి అంటూ నెమ్మదినెమ్మదిగా ఆదుకోమని మెగా కాంపౌండ్ బాటపడుతున్నట్లు టాక్.

ఈ విషయాలు గ్రహించిన రామ్ చరణ్ ‘సైరా’ నష్ట నివారణ చర్యల నిమిత్తం ఈ దీపావళి పండుగను పురస్కరించుకుని కొన్ని ప్రముఖ పత్రికలకు ఇంటర్వ్యూలు ఇచ్చి ఆ ఇంటర్వ్యూలతో తిరిగి ‘సైరా’ కలక్షన్స్ పరంగా పుంజుకుంటుంది అన్న సందేశం ఇస్తున్నట్లు తెలుస్తోంది. దీనితో ఈ అనుకోని వ్యూహానికి ‘సైరా’ బయ్యర్లు షాక్ అవ్వడమే కాకుండా కలక్షన్స్ క్లోజ్ అయిపోయిన సినిమాకు ఇప్పుడు చరణ్ ఇస్తున్న ఇంటర్వ్యూలు ఏమి పనిచేస్తాయి అంటూ తల పట్టుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

మూవీ ఇప్పటికే బాలీవుడ్ తో పాటు తమిళ మళయాళ ప్రేక్షకుల తిరస్కరణకు గురైన నేపధ్యంలో ఇప్పట్లో చిరంజీవి మరొకసారి జాతీయ స్థాయి సినిమాను తీసే సాహసాన్ని చేయడు అని అనిపిస్తోంది. ‘సైరా’ వల్ల చిరంజీవికి రికార్డులకన్నా ప్రశంసలు మాత్రమే దక్కిన పరిస్థితులలో కనీసం ఈ ప్రశంసలు చిరంజీవికి జాతీయ స్థాయిలో అవార్డులు అయినా దక్కుతాయ అన్న విషయం సమాధానం లేని ప్రశ్న.. 


మరింత సమాచారం తెలుసుకోండి: