జీవితం యాంత్రికంగా మారిపోవడంతో జీవితానికి సంబంధించిన జ్ఞాపకాలను పదిలంగా ఉంచుకోవాలన్న ఆతృత అందరిలోనూ బాగా పెరిగి పోతోంది. ముఖ్యంగా కోట్లాది రూపాయల పారితోషికాలను తీసుకునే సెలెబ్రెటీలు తమ బిజీ జీవితంలో తమ జ్ఞాపకాలను ఎక్కడ మరిచిపోతామో అన్న భయంతో ఇప్పుడు వారంతా ఇంప్రెషన్ ఆర్ట్ వైపు అడుగులు వేయడం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. 

‘ఇంప్రెషన్ అండ్ ఫ్రేమ్ ఆర్ట్’ అన్న పేరుతో పాపులర్ అవుతున్న ఈ ఆర్ట్ పట్ల ప్రస్తుతం ఒకమ్యానియా కొనసాగుతోంది.  ఇంతకీ ఈఆర్ట్ ప్రత్యేకత  ఏమిటి అన్నలోతైన విశ్లేషణలోకి వెళితే కొన్ని ఆసక్తికర విషయాలు తెలుస్తాయి. 

సెలెబ్రెటీల పిల్లలకు సంబంధించిన చిన్నారి చిట్టి కాళ్లు చేతులకు సంబంధించిన గుర్తుల్ని అదేవిధంగా వారి పిల్లలకు సంబంధించిన రకరకాల అందమైన జ్ఞాపకాలను డిజైనర్ ఆర్ట్ గా రూపొందిచే విధానమే ఈ ‘ఇంప్రెషన్ ఆర్ట్’ హైదరాబాద్ కు చెందిన ఆర్టిస్ట్ అనీలా ఈ రంగంలో ఇప్పుడు విపరీతమైన పేరు తెచ్చుకుంది. అమెకు సెలెబ్రెటీలు వారి పిల్లలకు సంబంధించిన జ్ఞాపకాలను చెబితే వాటిని అదే తరహాలో ఒక అచ్చులా తయారు చేసి ఒక అందమైన గాజు పెట్టెలో దానిని బద్రపరిచి ఆ సెలెబ్రెటీలకు ఇస్తోంది. 

హైదరాబాద్ లో ప్రత్యేకంగా దీనికోసం అనీలా ఒక ఆఫీస్ ను రన్ చేస్తోంది అంటే దీని మ్యానియా ఏస్థాయిలో ఉందో అర్ధం అవుతుంది. ఆమె దగ్గరికి వచ్చే క్లైంట్లు చాల మంది సెలబ్రిటీలే ఉండటం షాకింగ్ గా మారింది. బొడ్డుతాడు బ్రెస్ట్ మిల్క్ దగ్గర నుండి పాదాలు చిట్టి చేతులు నమూలను సేకరించి బూడిద సహాయంతో మెమరబుల్ గా వాటిని తయారు చేయడంలో అనీలాకు విపరీతమైన పేరు వస్తోంది. ఈమధ్య హీరో నాని కొడుకు అర్జున్ కు సంబంధించిన పాదం చేతిని ప్రింట్ నమూనాను తయారు చేయించుకున్న విషయం తెలిసిందే. నాని బాటలో ఇప్పుడు చాలామంది సెలబ్రిటీలు తమన్నా మంచు లక్ష్మీ మంజుల వంటి సెలెబ్రెటీలు తమ శరీరంలో తమకు నచ్చిన శరీర భాగానికి సంబంధించిన అచ్చులను అదే విధంగా తమ పిల్లలకు సంబంధించిన జ్ఞాపకాలను ఇలా అచ్చులు వేయించుకుంటున్నారు. ఇప్పుడు ఈ కల్చర్ టాలీవుడ్ ను టాటు కల్చర్ ను మించి షేక్ చేస్తోంది.. 



మరింత సమాచారం తెలుసుకోండి: