విజయ్ దేవరకొండకు ఒక వింత అలవాటు ఉందట. తాను నటించే సినిమా కథ ఫైనల్ అయిన ఆమూవీ దర్శకుడుతో ‘కలిసి పనిచేద్దాం’ అని చేపుతాడట. ఇలా ప్రతి హీరో తమ సినిమాలకు సంబంధించి ఇలాంటి మాటలు చెప్పినా విజయ్ తన సినిమాల విషయంలో తీసే సీన్స్ దగ్గర నుండి ఎడిటింగ్ వరకు అదేవిధంగా సినిమా విడుదలకు ముందు జరిగే ప్రమోషన్ వరకు విజయ్ ఇలా ప్రతి ఒక్కడి బాధ్యతలలోను ఎంటర్ అయి దర్శకుడుకి స్వేచ్చ లేకుండా చేస్తాడు అన్న మాటలు ఉన్నాయి.

ఇప్పుడు పూరీ జగన్నాథ్ విజయ్ దేవరకొండల మూవీ వచ్చే ఏడాది జనవరి నుండి ప్రారంభం కాబోతున్న పరిస్థితులలో విజయ్ కెలుకుడుకి పూరి తట్టుకుంటాడా అన్న అభిప్రాయాన్ని పూరీ సన్నిహితులు కొందరు ఏకంగా పూరి దగ్గరే తమ సందేహాలను వ్యక్త పరిచినట్లు టాక్. ఈ అనుకోని సందేహానికి షాక్ అయిన పూరీ తన సన్నిహితులు వద్ద మాట్లాడుతూ విజయ్ దేవరకొండ అత్యుత్సాహం పై కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసినట్లు టాక్.

ఒక కథ హీరో ఒప్పుకునే వరకే తాను హీరో కోరిన విధంగా ఆకథలో మార్పులు చేర్పులు చేస్తానని ఒకసారి కథ ఫైనల్ అయిన తరువాత తన సినిమాలో వేలు పెట్టడానికి బాలకృష్ణ లాంటి సీనియర్ హీరోలకు కూడ తాను ఆస్కారం ఇవ్వలేదు అని చెప్పినట్లు తెలుస్తోంది. అంతేకాదు తాను పరాజయాలతో ఉన్నప్పుడు హీరో రామ్ తో లేటెస్ట్ గా తీసిన ‘ఇస్మార్ట్ శంకర్’ విషయంలో కూడ కథ వరకు రామ్ చెప్పినట్లు విన్నా సీన్స్ చిత్రీకరణ విషయంలో ఆ మూవీ ప్రమోషన్ విషయంలో అన్నీ తాను అనుకున్నట్లుగానే చేసాను అంటూ పూరీ వ్యాఖ్యానించినట్లు వార్తలు వస్తున్నాయి.

పూరి తన సన్నిహితులతో  అన్న మాటలలోని యదార్దాలు ఎన్నో తెలియకపోయినా విజయ్ కెలుకుడు మనస్తత్వం తెలిసి పూరి ఇలా వ్యూహాత్మకంగా కామెంట్ చేసాడా అంటూ కొందరు అభిప్రాయ పడుతున్నారు. మామూలుగానే కొద్దిగా ఇగో ఎక్కువగా ఉండే విజయ్ దేవరకొండ అత్యుత్సాహాన్ని ఇలా పూరీ కట్టడి చేస్తే వీరిద్దరి మధ్య అభిప్రాయభేదాలు ఏర్పడి ఈ మూవీ ప్రాజెక్ట్ కు అసలుకే మోసం వస్తుందేమో అంటూ కొందరు సందేహాలు వ్యక్త పరుస్తున్నారు.. 


మరింత సమాచారం తెలుసుకోండి: