టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఇటీవల సైరా నరసింహారెడ్డి సినిమాతో యావరేజ్ విజయాన్ని మాత్రమే అందుకోగలిగారు. తొలితరం స్వతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో మెగాస్టార్ మరొక్కసారి తన నట విశ్వరూపాన్ని చూపించారు అనే చెప్పాలి. ఇక తొలిసారి ప్రాణం ఖరీదు సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన శివ శంకర వరప్రసాద్, ఆ తరువాత ఒక్కొక్కటిగా తనకు వస్తున్న అవకాశాలను వినియోగించుకుని మెల్లగా కెరీర్ పరంగా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ మెగాస్టార్ గా, నేడు టాలీవుడ్ గర్వించే గొప్ప నటుడిగా పేరు ప్రఖ్యాతలు గడించడం జరిగింది. 

 

ఇకపోతే కెరీర్ పరంగా ఎంతో ఉన్నతస్థానాలు అధిరోహించిన మెగాస్టార్, సంపాదన పరంగా కూడా భారీగానే ఆర్జించారు. ఇకపోతే ఆయన కుమారుడు రామ్ చరణ్ కు ఇటీవల వివాహం జరిగిన తరువాత వారందరూ కలిసి ప్రస్తుతం నివాసం ఉంటున్న ఇల్లు సరిపోకపోవడంతో, హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని ఎం.సి.హెచ్.ఆర్.డి ఇనిస్టిట్యూట్ సమీపంలోమరొక నూతన ఇంటిని ఇటీవల నిర్మించడం జరిగిందట. మెగాస్టార్ కోడలు ఉపాసన దగ్గరుండి మరీ ఎన్నోరకాల నూతన హంగులతో ఆ భవనాన్ని కట్టించారట. పలాటియల్ రెసిడెన్స్ అనేది ఈ నూతన భవంతి పేరని, అలానే 25000 చదరపు అడుగుల విస్తీర్ణంలో సకల సౌకర్యాలతో దీనిని నిర్మించడం జరిగిందని సమాచారం. 

 

ఇకపోతే ముంబైకి చెందిన ప్రఖ్యాత ఆర్కిటెక్ట్ లని పిలిపించి, ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఎన్నో రకాల నూతన హంగులతో ఈ భవనాన్ని నిర్మించారని, ఇక ఈ ఇంటిలోని ఒకొక్క గది, దేనికదే ఒక భూతల స్వర్గం అని సమాచారం. ముఖ్యంగా ఇంటి ప్రధాన హాల్ లో గోడలు సీలింగ్ ను జేడ్ తరహా డెకరేషన్ తో ఎంతో అద్భుతమైన డిజైన్ తో తీర్చిదిద్దారట, ఇక ఇంటిలోపల ప్రాచీన సంస్కృతి అయిన రెండో శతాబ్ద కాలం నాటి చరిత్ర ఉన్న డిజైన్ తో రూపొందించారట. దాదాపుగా ఎన్నో కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించబడిన ఈ భవంతిలోకి మెగాస్టార్ ఫ్యామిలీ అతి త్వరలో షిఫ్ట్ కానున్నట్లు చెప్తున్నారు. కాగా ఈ న్యూస్ ప్రస్తుతం పలు టాలీవుడ్ వర్గాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది....!!  

మరింత సమాచారం తెలుసుకోండి: