యువ‌ర‌త్న నంద‌మూరి బాల‌కృష్ణ రూలర్ గా విజృంభించాడు. ఇప్ప‌టికే స్టిల్స్‌, లుక్స్‌, టీజ‌ర్ల‌తో రూల‌ర్ గా బాక్సాఫీస్ ను తాను ఎలా రూల్ చేస్తానే చెప్ప‌క‌నే చెప్పేశాడు. ఇక ఈ రోజు రిలీజ్ అయిన ట్రైల‌ర్ చూస్తే బాల‌య్య ఆయ‌న అభిమానులు పెట్టుకున్న అంచ‌నాలు ఎంత మాత్రం త‌ప్ప‌లేదు. బాల‌య్య యాక్ష‌న్‌, డైలాగుల్లో కుమ్మేశాడు. ఇక తన శత్రువులను వేట కొడవలితో చీల్చి చండాడాడు. రూలర్ ట్రైలర్ చూసిన ఎవరియాకైనా ఆయన ఈసారి ఫ్యాన్స్ కి ఫీస్ట్ ఇవ్వనున్నాడన్న విషయం అర్థమైపోతుంది.

 

మ‌రో రెండు వారాల్లో రూల‌ర్ ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ క్ర‌మంలోనే సినిమా పై బ‌జ్ పెంచేందుకు ఆదివారం ఉద‌యం సినిమా యూనిట్ ట్రైల‌ర్ రిలీజ్ చేసింది. బాలయ్య మార్కు హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలు, ఎమోషన్స్ మరియు కామెడీ తో కూడిన రూలర్, ఫుల్ ప్యాక్డ్ కమర్షియల్ మూవీగా కనిపిస్తుంది. ఇక సినిమాలో అన్ని స‌మంగా ఉన్నా ముఖ్యంగా సెంటిమెంట్ వ‌ర్క‌వుట్ అయితే మాత్రం రూల‌ర్ బాల‌య్య ఖాతాలో బ్లాక్ బ‌స్ట‌ర్ అవ్వ‌డం ఖాయం.

 

బాల‌య్య సినిమాలు మాస్‌కు, ఆయ‌న అభిమానుల‌కు ఎలాగూ న‌చ్చుతాయి. ఇక సెంటిమెంట్ తో ఆయ‌న మ‌హిళ‌ల‌ను, యూత్‌ను, క్లాస్ ను థియేట‌ర్ల‌కు ర‌ప్పిస్తే రూర‌ల్ బాక్సాఫీస్ ను రూల్ చేయ‌డం ఖాయం. ఒకప్పటి పోలీస్, బిజినెస్ మెన్ గా ఎందుకు మారాడు అనేది మూవీలో ప్రధాన మలుపు. కె ఎస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సి కళ్యాణ్ నిర్మిస్తున్నారు.

 

గ‌తంలో ఇదే కేఎస్‌.ర‌వికుమార్ - బాల‌య్య కాంబోలో వ‌చ్చిన జై సింహా హిట్ అవ్వడంతో రూల‌ర్‌పై కూడా మంచి అంచ‌నాలే ఉన్నాయి. వేదిక‌, సోనాల్ చౌహాన్ హీరోయిన్స్ గా నటిస్తుండగా, చిరంతన్ భట్ సంగీతం అందిస్తున్నారు. ఈనెల 20న రూలర్ క్రిస్మస్ కానుకగా విడుదల కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: