యువరత్న బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ సినిమా రులర్ సినిమా టీజర్ మరియు ట్రైలర్ ఇప్పటికే యూట్యూబ్ లో రిలీజ్ అయి శ్రోతలను విశేషంగా ఆకరట్టుకోవడంతో పాటు సినిమాపై ప్రేక్షకుల తో పాటు నందమూరి ఫ్యాన్స్ లో కూడా విపరీతరమైన అంచనాలు క్రియేట్ చేయడం జరిగింది. కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో సి కళ్యాణ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలకృష్ణ సరసన సోనాల్ చౌహన్, వేదిక హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా తరువాత బాలకృష్ణ, బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఒక సినిమాలో నటించనున్న విషయం తెలిసిందే. 

 

యువ నిర్మాత మిరియాల రవీందర్ రెడ్డి ఎంతో భారీగా నిర్మించనున్న ఈ సినిమాలో బాలకృష్ణ రెండు రకాల విభిన్న పాత్రల్లో నటిస్తున్నట్లు సమాచారం. అలానే ఈ సినిమాలో నటించబోయే ఇద్దరు హీరోయిన్ల ఎంపిక ఇప్పటికే పూర్తి ఆయిందని కూడా టాక్. ఇక నేడు కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం, ఈ సినిమాలో విలన్ గా కేజీఎఫ్ లో ప్రస్తుతం విలన్ గా నటిస్తున్న ఖల్ నాయక్ సంజయ్ దత్ ని తీసుకోవాలని దర్శకుడు బోయపాటి భవిస్తున్నాడట. 

 

మంచి యాక్షన్ ఎంటర్టైనర్ గా ప్రస్తుత సమాజానికి ఉపయోగపడే ఒక మెసేజ్ ని జోడించి దర్శకుడు బోయపాటి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు సమాచారం అందుతోంది. వాస్తవానికి బోయపాటి సినిమాల్లో విలన్స్ ఎంతో పవర్ఫుల్ గా ఉంటారు. ఆ విధంగానే ఈ సినిమాలో కూడా విలన్ క్యారెక్టర్ మరింత అద్భుతంగా ఉండబోతోందని, అందుకోసం సంజయ్ దత్ వంటి వ్యక్తి అయితే సరిగ్గా సరిపోతారని ఆయన భావిస్తున్నారట. మరికొద్ది రోజుల్లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతున్న ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసి రాబోయే వేసవి కానుకగా రిలీజ్ చేయాలని చూస్తునట్టు తెలుస్తోంది. కాగా ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్త పై అధికారిక ప్రకటన మాత్రం వెలువడాల్సి ఉంది....!!

మరింత సమాచారం తెలుసుకోండి: