రియల్ లైఫ్ లో ని మామా అల్లుళ్లు... రిల్ లైఫ్లో కూడా మామ అల్లుల్లుగా నటించిన చిత్రం వెంకీ మామ. అక్కినేని వారసుడు... దగ్గుబాటి వారసుడు హీరోలుగా మల్టీస్టారర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకుల్లో భారీ అంచనాలను నెలకొల్పింది. బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో వెంకటేష్ సరసన హాట్ బ్యూటీ రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ నటించగా నాగచైతన్య సరసన అందాల చందమామ రాసి కన్నా నటించింది. కాగా ఈ సినిమా నేడు విక్టరీ వెంకటేష్ పుట్టిన రోజు సందర్భంగా విడుదలై ప్రేక్షకుల ముందుకొచ్చింది . అయితే ప్రేక్షకుల్లో భారీ అంచనాలను నెలకొల్పిన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను  చేరుతున్నట్లు కనిపిస్తోంది. మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంటూ దూసుకుపోతుంది ఈ సినిమా. 

 

 

 

 ఆద్యంతం  వినోదభరితంగా ఈ సినిమాలో వెంకటేష్ వన్ మాన్ షో గా సినిమాను నడిపించాడు. వెంకటేష్ నటన కామెడీ టైమింగ్ ముందు నాగచైతన్య తేలిపోయాడు. అయితే ఈ సినిమాలో అన్నీ బాగానే ఉన్నప్పటికీ..ఈ సినిమా సెకండాఫ్ లో ఫ్లాష్ బ్యాక్  సీన్లతో కాస్త గందరగోళం నెలకొంటుంది. అయినప్పటికీ సినిమాలో ఉన్న కామెడీ సెంటిమెంట్ ముందు ప్రేక్షకులకు అది అంతగా పట్టించుకోరు. సినిమాలో మరోసారి వెంకటేష్ తన కామెడీ టైమింగ్ సెంటిమెంట్ సీన్ లతో అందరిని ఆకట్టుకున్నారు. యువ హీరో నాగచైతన్య డామినేట్  చేసేసాడు వెంకటేష్. అయితే సినిమా చూస్తుంటే వెంకీమామ మంచి విజయం సాధించడం ఖాయం అన్నట్లుగా తెలుస్తోంది. 

 

 

 ఇదిలా ఉంటే వెంకటేష్ మల్టీస్టారర్ సినిమాల ద్వారా మంచి విజయాలను సొంతం చేసుకుంటున్నారు. గతంలో  సోలో హీరోగా వెంకటేష్ కొన్ని  సినిమాలు చేసినప్పటికీ వెంకటేష్ చేసిన సినిమాలు మాత్రం అంతగా ప్రేక్షకుల ఆదరణ పొందలేకపోయింది. మొన్నటి వరకు... వెంకటేష్ తీసిన సినిమాల్లో దృశ్యం మినహా... మిగతా సినిమాలు  అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి.కానీ  ఏడాది సంక్రాంతికి మల్టీ స్టారర్ గా వచ్చిన ఎఫ్2 సినిమాతో పాటు ఈ రోజు విడుదలైన వెంకీ మామ సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుడంతో... వెంకటేష్ ఇక సోలో హీరోగా సినిమాలు తీయడం మానుకుని మల్టీస్టారర్ సినిమాలు చేస్తూ ఇలాగే అలరిస్తూ ఉండాలి అని ప్రేక్షకులు అనుకుంటున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: