చక్కనమ్మ చిక్కినా అందమే అంటుంటారు. ఈ స్టేట్ మెంట్ రాంగ్ అని కీర్తి సురేష్ ని చూస్తే అర్థమవుతోంది. అవును కొంతమంది బొద్దుగా ఉంటేనే ముద్దుగా అనిపిస్తారు. అలాంటి ఒకప్పటి బొద్దు ముద్దుగుమ్మ కీర్తి సురేష్ లుక్ ఇప్పుడు తేడా కొడుతోంది. సినిమా కోసం బక్కచిక్కిన చెన్నై బ్యూటీలో ఒకప్పటి కళ మాయమైపోయింది. 

 

కొంతమంది హీరోయిన్స్ బొద్దుగా ఉంటేనే బాగుంటారు. అందుకు ఖుష్బూ లాంటి సీనియర్ హీరోయి్నస్ బెస్ట్ ఎగ్జాంపుల్. ఈ జనరేషన్ లో నిత్యామీనన్, కీర్తి సురేష్ లాంటి హీరోయిన్స్ సైతం బొద్దుతనంలోనే మురిపించి మెప్పించారు. కానీ ఇప్పుడు కీర్తి సురేష్ డేటింగ్ చేసి మరీ పీలగా తయారైంది. ఈ మార్పు చెన్నై చిన్నదాని ఫేస్ మీద ఎఫెక్ట్ చూపించింది. 

 

కీర్తిసురేష్ మొద్దుగా ఉంటేనే సహజంగా ముద్దుగా ఉండేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. చబ్బీగా కవ్వించే కీర్తి సురేష్ లో ఇప్పుడు ఆ చరిష్మా కనిపించడం లేదు. ఇటీవల జాతీయ అవార్డు అందుకున్న అనంతరం రాష్ట్రపతి ఇచ్చిన విందుకు వెళ్లే ముందు కీర్తి వైట్ డ్రెస్ లో దిగిన ఫోటోలను ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. ఆ ఫోటోల్లో కనిపిస్తున్న కీర్తిలో మునుపటి చరిష్మా కనిపించడం లేదు. ఈ ముద్దుగుమ్మ బొద్దుగా ఉంటేనే ఎంతో అందంగా ఉండేదని నెటిజన్ లు పెదవి విరిచేస్తున్నారు. 

 


కీర్తిసురేష్ ప్రస్తుతం మిస్ ఇండియా సినిమాతో పాటు బాలీవుడ్ మైదాన్ అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాల కోసమే చెన్నై బ్యూటీ వర్కవుట్ చేసి స్లిమ్ గా మారిపోయింది. దీంతో కీర్తి సురేష్ సహజసిద్ధమైన అందాన్ని కోల్పోయింది. స్లిమ్ గా మారింది కానీ పీలగా ముఖంలో కళ పోయి ఫేస్ తేడా కొట్టినట్టు కనిపిస్తోంది. బాగా బక్కచిక్కిన ఈ చెన్నై బ్యూటీలో మునుపటి గ్లో మాయమైపోయింది.  

 

 


 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: