రేడియో జాకీ గా జీవితాన్ని ప్రారంభించిన ప్రదీప్ బుల్లతెరపై లెజెండరీ మెల్ యాంకర్ గా మంచి పేరును సంపాదించుకున్నారు.. ఏ ఈవెంట్ లో అయినా ప్రదీప్ మాట వినపడక పోతే షో బోసిగా ఉందనెంతగా ప్రదీప్ పేరును సంపాదించుకున్నాడు.. అయితే బుల్లితెర టీవీ కార్యక్రమాలే కాకుండా సినిమాలలో కూడా ప్రదీప్ నటిస్తూ వస్తున్నాడు.. అక్కడ కూడా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నాడు..ఇప్పుడు టాప్ రేంజులో ఉన్నాడు..

 

 

ఇకపోతే ప్రదీప్ ప్రధాన పాత్రలో ఓ సినిమా రాబోతుంది.. ఆ సినిమానే 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే చిత్రంతో రాబోతున్నాడు అనగానే అంతా ఆసక్తిగా ఎదురు చూడటం మొదలు పెట్టారుప్రదీప్‌కు మొదటి సినిమానే అయినా ఇన్ని రోజులు ఇండస్ట్రీలోనే ఉన్నాడు కనుక సినిమాకు మంచి బజ్‌ ఉంది. తాజాగా విడుదలైన సినిమాలోని మొదటి పాట ఏకంగా 10 మిలియన్‌ల వ్యూస్‌ను దక్కించుకుంది. 

 

 

అయితే..కోటి మంది ఈ పాటను యూట్యూబ్‌ మరియు ఇతరత్ర సోషల్‌ మీడియా బ్లాగ్‌లలో చూడటం జరిగింది. ఒక స్టార్ హీరో కి వచ్చిన ఇమేజ్ ప్రదీప్ సినిమాలోని పాటకు రావడం విశేషమని చెప్పాలి..సరికొత్త కథనంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రదీప్ నటన ప్రేక్షకులకు మరింత దగ్గరైంది..దీంతో పోస్టర్ నుండి మొదలుకొని పాట విడుదల వరకు మంచి రెస్పాన్స్ వస్తోంది..ఈ సినిమా పై చాలా మంది పాజిటివ్ టాక్ ను ఇస్తుండటంతో సినిమా హిట్ అయ్యేలా ఉందని అందరూ అంటున్నారు..

 

 

ఇది ఇలా ఉండగా సూపర్ స్టార్ మహేష్ బాబు చేతుల మీదుగా విడుదల చేసిన ఆ పాట యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లోనే ఉంది. ఆ పాట చాలా బాగుండటంతో వాట్సప్‌ మరియు ఇతరత్ర సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంది. సిడ్‌ శ్రీరామ్‌ పాడిన పాటను జనాలు మరోసారి ఆధరిస్తున్నారు. గతంలో ఆయన పాడిన పాటలు రికార్డులు సృష్టించాయి. ఇప్పుడు ఈ పాట కూడా యూట్యూబ్‌లో సెన్షేషనల్‌ క్రియేట్‌ చేయడం ఖాయంగా కనిపిస్తుంది. పాట విడుదల తర్వాత సినిమాపై ఆక్తి పెరిగింది.. సినిమా విడుదల పై చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు..

 

మరింత సమాచారం తెలుసుకోండి: