ప్రభాస్ ఫ్యాన్స్ ను డిసప్పాయింట్ చేస్తూనే ఉన్నాడు. అభిమానుల ఆశలు, వాళ్ల కోరికలను పట్టించుకోకుండా, సొంత దారిలో వెళ్తున్నాడు. ప్రేమ కానుకలు లాంటివి ఎక్స్ పెక్ట్ చేయకండి. దానికి చాలా టైమ్ ఉంది అన్నట్టు లేట్ చేస్తున్నాడు ప్రభాస్. 

 

ప్రభాస్ ప్యూర్ లవ్ స్టోరీలో నటించి చాలా రోజులైంది. డార్లింగ్ తర్వాత ప్రభాస్ ఎక్కువగా కమర్షియల్, యాక్షన్ రోల్స్ లోనే కనిపించాడు. బాహుబలిలో కత్తులు ఈటెలతో యుద్ధం చేస్తే.. సాహోలో గన్నులు, బాంబులు పేల్చాడు. అయితే మళ్లీ ఇన్నాళ్లకు రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ లవ్ స్టోరీ చేస్తున్నాడు ప్రభాస్. 

 

డార్లింగ్ ని ప్యూర్ లవ్ స్టోరీలో చూడాలనుకున్న అభిమానులు, రాధాకృష్ణ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ ప్రభాస్ మాత్రం ఈ ప్రాజెక్ట్ ను చాలా లేట్ చేస్తున్నాడు. సాహో తర్వాత చాలా గ్యాప్ తీసుకొని రీసెంట్ గానే షూటింగ్ లో అడుగుపెట్టాడు. దీంతో సినిమా ఎలాగో లేట్ అవుతోంది. కనీసం ఫస్ట్ లుక్ అయినా చూద్దామనుకుంటున్నారు అభిమానులు. కానీ ఈ ఆశలను కూడా పోస్ట్ పోన్ చేస్తున్నాడు ప్రభాస్. 

 

ప్రభాస్ లవ్ స్టోరీలో నటిస్తున్నాడు కాబట్టి.. వాలంటైన్స్ డే కు ఫస్ట్ లుక్ వస్తుందని డైహార్డ్ ఫ్యాన్స్ అంతా ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. కానీ ప్రభాస్ మాత్రం ప్రేమికుల రోజు కాకుండా.. ఉగాదికి ఫస్ట్ లుక్ రిలీజ్ చేయాలని అనుకుంటున్నారట. మార్చి 25న పోస్టర్ రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నాడట డార్లింగ్. సో వాలంటైన్స్ డేకి ఫస్ట్ లుక్ వస్తుంది అనుకుంటోన్న ఫ్యాన్స్ కు ఇది కొంచెం డిసప్పాయింట్ అనే చెప్పొచ్చు. మొత్తానికి ప్రభాస్ ప్రేమికుల రోజు గుడ్ న్యూస్ చెబుతాడనుకుంటే.. ఫ్యాన్స్ ను డిసప్పాయింట్ చేశాడు. ఎన్నో ఊహలు ఊహించుకున్న అభిమానుల ఆశలను అడియాశలు చేశాడు. చూద్దాం.. ప్రభాస్ గుడ్ న్యూస్ ఎపుడు చెబుతాడో.!

మరింత సమాచారం తెలుసుకోండి: