ఈ మధ్య కాలంలో హీరోలందరూ ఫిట్‌నెస్‌పైనే ఎక్కువ దృష్టి పెడుతున్నారు. కండలు తిరిగిన దృఢమైన దేహదారుఢ్యం పొందేందుకు ఎంతగానో జిమ్ లో కసరత్తులు చేస్తున్నారు. ఇండస్ట్రీ తో సంబంధం లేకుండా అన్ని ఇండస్ట్రీలో హీరోలు ఎక్కువగా ఫిట్నెస్ పైనే దృష్టి పెడుతున్నారు. నటనపై ఎంత ద్రుష్టి పెడుతున్నారో ఫిట్నెస్ పైన కూడా అంతే సమానంగా దృష్టిపెడుతున్నారు. అందుకే ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది హీరోలు సిక్స్ ప్యాక్ లతో సినిమాలో దర్శనమిస్తున్నారు. అయితే ఇక్కడ ఫోటో చూడండి... కండలు తిరిగి పోయినా భారీకాయం తో ఉన్న హీరో ఎవరో చెప్పగలరా...? కండలుతిరిగి పోయిన దృఢ కాయంతో బాగానే ఉంది కానీ హీరో అటు తిరిగి ఉండడంతో గుర్తుపట్టలేక పోతున్నాము అంటారా..!
ఆ హీరో ఎవరో కాదు దక్షిణాది ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తూ... తమిళ సినిమాల్లో హీరోగా తెలుగు సినిమాల్లో విలన్ గా విభిన్నమైన పాత్రల్లో నటిస్తూ... తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న తమిళ హీరో ఆర్య. ఆర్య ఎప్పుడు ఫిట్నెస్ విషయంలో కచ్చితత్వంతో ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఎప్పుడు దృఢమైన భారీకాయం తోనే కనిపిస్తూ ఉంటారు ఆర్య. ఇక నటన విషయంలో అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. విలక్షణమైన నటనతో పాత్రలో ఒదిగిపోయి మరి నటిస్తూ ఉంటాడు ఆర్య.
మరి ఈ తాజా లుక్ దేనికోసం అంటారా.. తన 30సినిమా కోసం తీవ్రంగా శ్రమించి.. కండలు పెంచి కొత్త అవతారంలో కి మారిపోయాడు ఆర్య . ఈ సినిమాకు సంబంధించిన వివరాలు గురువారం వెల్లడిస్తాను అని చెబుతూ ఈ ఫోటోని ఆర్య సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. మీరు అంతట మీరు బలవంతులుగా మారేంత వరకూ తెలియదు మీరు ఎంత బలవంతులో అంటూ ఈ ఫోటోకి క్యాప్షన్ ఇచ్చాడు తమిళ హీరో ఆర్య. ఈ ఫోటో సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ గా మారిపోయింది. ఫిట్నెస్ పై ఆర్య చూపించిన డెడికేషన్ కి ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్లు . హార్డ్ వర్క్ అంకితభావంతో అందరికీ స్ఫూర్తిగా నిలిచారు అంటూ ఆర్య భార్య సాయెష సైగల్ పేర్కొన్నారు. ప్రస్తుతం దర్శకుడు శక్తి సౌందరరాజన్ తెరకెక్కిస్తున్న సినిమాలు నటిస్తున్నారు హీరో ఆర్య.