అందాల తార శ్రీదేవి గురించి కొన్ని నిజాలు ఈ రోజు తెలుసుకుందాం. శ్రీదేవి అసలు పేరు అమ్మయంగార్ అయ్యప్పన్. శ్రీదేవికి చిన్నప్పుడే ఘోర ప్రమాదం తప్పింది. రాఘవేంద్రవావుగారి మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఉన్నప్పుడు శ్రీదేవి రోడ్డు దాటే సీన్ చేస్తున్నప్పుడు కారు యాక్సిడెంట్ జరిగింది. అక్కడ ఏ మాత్రం ఒక్క సెకన్ తేడా వచ్చినా సరే ఈ అందాల తారను మనం చూడగలిగేవాళ్ళం కాదు. ఇక తెలుగులో వేటగాడుతో శ్రీదేవిని స్టార్ హీరోయిన్ని చేసిన రాఘవేంద్రరావే బాలీవుడ్లో కూడా ఆమెను ఒక్క సినిమాతోనే స్టార్ హీరోయిన్ని చేశాడు.
హిమ్మత్‌వాలాతో స్టార్ స్టేటస్ తెచ్చుకున్న శ్రీదేవి తోఫా చిత్రంతో వెనుతిరిగి చూడలేదు. కేవలం శ్రీదేవిని స్టార్‌ను చేయడానికే కసిగా హిందీ సినిమా చేశారు కె. రాఘవేంద్రరావు. శ్రీదేవి హిందీ సినిమాలో ఎప్పుడైతే స్టార్‌గా ఎదిగిందో ఆమె తల్లి వెంటనే తనకు పెళ్ళి చేయాలని పట్టుపట్టింది. అయితే తెలిసిన వాళ్ళ ద్వారా హీరో రాజశేఖర్‌కి వచ్చి వివాహం చేయాలనుకున్నారు ఆమె తల్లి. కానీ అందుకు రాజశేఖర్ తల్లి హీరోయిన్స్ కాని సినిమాకి సంబంధించినవాళ్ళు ఎవ్వరూ వద్దని ఆ ప్రపోజల్‌ని అక్కడితోనే ఆపేశారట.
అయితే అప్పటికి రాజశేఖర్ మాత్రం ఇంకా సినిమాల్లోకి రాలేదు. ఎంబిబిఎస్ చదువుతా వున్నారు. నగీనాతో స్టార్డమ్ తెచ్చుకున్న శ్రీదేవి ఒక తొమ్మిదేళ్ళపాటు అందరికంటే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుని రికార్డు సృష్టించింది. అంతే కాక హీరోయిలన్లలో కూడా మొదటిసారి స్టార్ డమ్ శ్రీదేవి తీసుకురావడం విశేషం. హీరోలకు ఏ మాత్రం తీసిపోకుండా స్టార్ డమ్ తెచ్చుకుంది శ్రీదేవి. ఇక శ్రీదేవి భర్త బోనీకపూర్ ఆమెను బుట్టలో వేసేందుకు అప్పట్లో చాలా ప్లాన్స్ వేశారు. ఏదీ కుదరక పోవడంతో మిస్టర్ ఇండియా సినిమాలో అప్పట్లోనే శ్రీదేవికి రెమ్యూనరేషన్ అందరూ పదిలక్షలు ఇస్తుంటే బోనీకపూర్ మాత్రం ఆమెకు దగ్గర కావడానికి పదకొండు లక్షలు ఇచ్చారట. ఈ విషయాన్ని బోనీకపూరే ఓసారి ఇంటర్వ్యూలో తెలిపారు. కేవలం ఆమెకు దగ్గరకావడానికే అలా చేశాను అని అన్నారు.