మహేష్ బాబు వరస ఫ్లాప్ లతో ఉన్నప్పుడు కొరటాల శివ మహేష్ ను ఆదుకున్నాడు. దీనితో కొరటాల అంటే మహేష్ కు ప్రత్యేక అభిమానం. ఇప్పుడు అదే కొరటాల తీరుతో మహేష్ కు ఊహించని సమస్యలు వస్తున్నాయి అంటూ ఇండస్ట్రీలో గాసిప్పులు గుప్పుమంటున్నాయి. 


మహేష్ వంశీ పైడిపల్లిమూవీ ప్రాజెక్ట్ క్యాన్సిల్ కావడంతో దర్శకుడు పరుశు రామ్ రంగంలోకి దిగిన విషయం తెలిసిందే. అయితే పరుశు రామ్ ను మహేష్ దగ్గరకు తీసుకు వెళ్ళి వారిద్దరి మధ్య సాన్నిహిత్యం కుదిరేలా రాయబారాలు చేసింది మాత్రం కొరటాల అని అంటారు. అంతేకాదు మహేష్ పరుశు రామ్మూవీ ప్రాజెక్ట్ ఫైనల్ అయితే ఆ మూవీలో తనకు కూడ షేర్ కావాలని ముందుగానే ఈ మూవీ కోసం రాయబారాలు చేస్తున్న మైత్రీ మూవీస్ సంస్థకు కొరటాల కండిషన్ పెట్టినట్లు టాక్.


అయితే మహేష్ పరుశు రామ్ కథ విషయంలో తన నిర్ణయం చెప్పే విషయంలో ఆలస్యం చేయడంతో పరుశు రామ్ 14 రీల్స్ సంస్థకు ఒక సినిమా చేస్తానని ఎగ్రిమెంట్ చేసుకుని అడ్వాన్స్ కూడ తీసుకున్నాడట. దీనితో పరుశు రామ్ మహేష్ తో సినిమా చేస్తే అందులో తమకు కూడ వాటా కావాలని 14 రీల్స్ సంస్థ అడుగుతున్నట్లు తెలుస్తోంది. 


దీనితో మహేష్ పరుశు రామ్మూవీ ప్రాజెక్ట్ కు ముగ్గురు భాగస్వాములుగా మారడంతో పాటు ఈ మూవీలో నటించినందుకు మహేష్ కు షేర్ ఇవ్వవలసిన పరిస్థితులలో వాటాల పంపకం లెక్కలు తేలడం లేదు అని గాసిప్పులు వస్తున్నాయి. ఇప్పుడు కొరటాల వల్ల తన లేటెస్ట్ మూవీకి సమస్యలు రావడంతో ఈ వాటాల లెక్కలను తేల్చడానికి మహేష్ తన భార్య నమ్రత ను రంగంలోకి దింపి ఈ మూవీ ప్రాజెక్ట్ జారిపోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు టాక్. దీనితో ఈ సమస్యలు మహేష్ కు సన్నిహితుడైన కొరటాల ద్వారా ఈ సమస్యలు మహేష్ కు రావడం ఇండస్ట్రీ హాట్ టాపిక్..

 

మరింత సమాచారం తెలుసుకోండి: