మెగాస్టార్ చిరంజీవికి తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా... సొంత టాలెంట్ తో ఎదిగి ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రేక్షకుల మెగాస్టార్ గా మారిపోయారు. ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమ పెద్దగా కొనసాగుతున్నారు మెగాస్టార్ చిరంజీవి. అయితే మెగాస్టార్ చిరంజీవి ఇప్పటివరకు 150 సినిమాల్లో నటించారు. ప్రస్తుతం 152 రెండవ సినిమా తెరకెక్కుతుంది. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇప్పటి వరకు 151 సినిమాల్లో చిరంజీవి సరసన ఎంతో మంది హీరోయిన్లు నటించారు. ఇలా చిరంజీవి సరసన నటించిన హీరోయిన్ లలో... ఎంతో మంది ఫేవరేట్ జోడీలు  ఉన్నాయి.

 

 

 

 ముఖ్యంగా చిరంజీవి రాధిక, చిరంజీవి విజయశాంతి ఇలా చిరంజీవి తో నటించిన వారిలో  ఎంతోమంది చిరంజీవికి ఫేవరెట్ జోడి గా పేరు తెచ్చుకున్నారు. ఇలా చిరంజీవికి ఫేవరేట్ జోడి గా పేరు తెచ్చుకున్న వారి లిస్టులో సిమ్రాన్ కూడా ఉంటుంది. చిరంజీవితో పలు సినిమాల్లో నటించింది. అయితే అందరూ హీరోయిన్లతో కెమిస్ట్రీ ఒక ఎత్తయితే సిమ్రాన్ తో మాత్రం  చిరంజీవి కెమిస్ట్రీ ఒక ఎత్తు అని చెప్పాలీ. కొందరు హీరోయిన్లతో ఎంతో రొమాంటిక్ కెమిస్ట్రీ ఉంటే సిమ్రాన్ తో మాత్రం ఎప్పుడూ తెగదెంపులు... గొడవలు తోనే చిరంజీవి సినిమాలు ఉన్నాయి. అసలు సినిమాలో  ఇద్దరికీ  పడేది కాదు. 

 

 

 చిరంజీవి సిమ్రాన్ జంటగా నటించిన చిత్రం మృగరాజు. సినిమాలో ఓ అడవి ప్రాంతంలో చిరంజీవి నివసిస్తుంటే సిమ్రాన్ ఒక అధికారిగా అక్కడికి వస్తుంది. వీరిద్దరి మధ్య ప్రేమ పుడుతుంది. కానీ ఈ ప్రేమ ఎక్కువ రోజులు మాత్రం ఉండదు. వీరిద్దరికీ పెళ్లి అయ్యాక సమస్యలు వచ్చి  విడిపోతారు... ఇక ఈ సమస్యలు సినిమా చివరి వరకూ కొనసాగీ  చివర్లో ఇద్దరూ ఒకటవుతారు. చిరంజీవి సిమ్రాన్ నటించిన మరో సినిమా డాడీ. ఈ సినిమాలో కూడా ఇంతే. వీరిద్దరూ ప్రేమ వివాహం చేసుకొని... ఆ తర్వాత గొడవలు పడి విడిపోతారు. సినిమా మొత్తం వీరిద్దరి మధ్య గొడవలు. ప్రతి విషయంలో గొడవ పడుతూనే ఉంటారు. తెగదెంపులు చేసుకుని విడిపోతారు. కానీ క్లైమాక్స్ లో మాత్రం వీరిద్దరూ కలుస్తారు. ఇద్దరు నటించిన రెండు సినిమాల్లో చిరంజీవికి సిమ్రాన్ కి  అస్సలు పడదు.

మరింత సమాచారం తెలుసుకోండి: