జబర్దస్త్ సీనియర్ హాస్యనటులలో చంటి, భాస్కర్, సుధాకర్, చమ్మక్ చంద్ర, అదిరే అభి లాంటి మంచోళ్ళు ఎంతో మందికి అవకాశాలను ఇప్పించి వారి జీవితాలని పూర్తిగా మార్చేశారు. వీళ్ల కారణంగానే చైల్డ్ ఆర్టిస్ట్ నరేష్, హైపర్ ఆది లాంటి సూపర్ టాలెంట్ ఉన్న హాస్యనటులు మన తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు. అలానే జబర్దస్త్ కామెడీ షో లో బాగా ఫేమస్ అయిన నవీన్ ని కూడా సీనియర్ హాస్యనటుడైన అదిరే అభి నే బుల్లి తెరకు పరిచయం చేశాడు. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని గుర్తుచేసుకుంటూ నవీన్ అదిరే అభి యొక్క మంచి స్వభావాన్ని చెప్పుకొచ్చాడు.




గుబురు గడ్డం లుక్ కలిగి ఉండి హాస్యం పండించడంతో సిద్ధహస్తుడైన నవీన్ ఓ చానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... 'నా కెరీర్ చూసుకుంటే అదిరే అభి పరిచయం అయ్యాక ఒకలాగా... పరిచయం కాకముందు మరొక లాగా ఉండేది. అభి ఎంతోమందికి అవకాశాలు కల్పిస్తూ తాను హెల్ప్ చేసిన వారు బాగుండాలని... వాళ్ళ జీవితం సరిగా సెటిల్ అవ్వాలని కోరుకుంటాడు.

 



తన వల్ల బుల్లి తెర పైకి వచ్చినవాళ్లు కెరీర్ పరంగా ఎదుగుతుంటే... ప్రోత్సహిస్తాడు తప్ప అసూయ పడటం ఈర్ష్య పడటం లాంటివి అతనిలో అస్సలు ఉండవు. అదిరే అభి కారణంగా తెలుగు రాష్ట్రాల్లో అశేషమైన పాపులారిటీ సంపాదించిన హైపర్ ఆది ని చూసి, ఇంకా నన్ను చూసి అతను సంతోష పడతాడే కానీ అసూయపడడు. అందర్నీ చాలా బాగా చూసుకుంటాడు. అదిరే అభి దయవల్లనే నేను గొప్ప కామెడీ షో అయిన జబర్దస్త్ కి వెళ్ళగలిగాను. జబర్దస్త్ క్రేజీ కారణంగానే అనేకమైన ఈవెంటు లని, సినిమాలలో కూడా చేస్తున్నాను. ఈ రోజున నేను ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి అదిరే అభి నే కారణం', అని చెప్పుకొచ్చాడు నవీన్.


మరింత సమాచారం తెలుసుకోండి: