యాంకర్ గా తెరంగేట్రం చేసి ఇప్పుడు వెండితెరపై 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అంటూ పాఠాలు చెప్పేందుకు వస్తున్నాడు ప్రదీప్ మాచిరాజు.. ప్రేమ కథ అంటేనే ఇంట్రస్టింగ్ కదా.. ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంటర్వ్యూ ఇస్తూ.. తన మొదటి లవర్ గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పాడు ప్రదీప్ మాచిరాజు.

 

 

మీ మొదటి గర్ల్‌ఫ్రెండ్‌ పేరేంటి ? అని అడిగితే ముందు.. సోనాలి బింద్రే అంటూ చెప్పాడు.. ఈలోపు యాంకర్ చెంబులు, బిందెల గురించి నేను చెప్పమనలేదు. ఆమె అంటే నాకూ ఇష్టమే. కానీ రియల్‌ గర్ల్‌ఫ్రెండ్‌ పేరు చెప్పు అంటూ ఫోర్స్ చేసేశాడు. అప్పుడు విషయం బయటపెట్టాడు ప్రదీప్ మాచిరాజు.

 

 

తన ఫస్ట్ లవర్ ఈ పాటికి పెళ్లయిపోయిందని... ఇప్పుడు పిల్లలతో కలిసి ఈ షో చూస్తూ ఉంటుందని అన్నాడు. అందుకే తన పేరు బయటపెట్టదలచుకు కోలేదని చెప్పాడు ప్రదీప్. అదే సమయంలో తన పెళ్లి విషయాలు కూడా పంచుకున్నాడు ప్రదీప్. తన పెళ్లి గురించి ఇంకా ప్లాన్‌ చేసుకోలేదని.. వెబ్‌సైట్స్‌లో మాత్రం నా పెళ్లి గురించి బాగా రాస్తారని కామెడీ చేశాడు.

 

 

బహుశా వచ్చే ఏడాది తన పెళ్లి ఉండొచ్చని సూచన ప్రాయంగా చెప్పాడు. దీనిపై ఇంకా క్లారిటీగా ఏమీ అనుకోలేదని చెప్పాడు. అయితే.. ఇంట్లో వాళ్లు చూసిన సంబంధాన్ని చేసుకుంటానని మాట ఇచ్చేశాడు. మరి పెళ్లి కూతురు కోసం పెళ్లి చూపులు’లాంటి కార్యక్రమం ఏమైనా పెడతారా అని యాంకర్ అడిగితే.. అలాంటిదేమీ లేదన్నాడు ప్రదీప్ మాచిరాజు .

 

మరింత సమాచారం తెలుసుకోండి: