‘మాపల్లె గోపాలుడు’ నుండి ‘ఒక్కడు’ మూవీదాక అనేక సూపర్ హిట్ సినిమాలలో నటించిన సీనియర్ హీరో అర్జున్ ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారిపోయి విభిన్నపాత్రలు చేస్తున్నాడు. ప్రస్తుతం తన కూతురు ఐశ్వర్య  ను హీరోయిన్ గా సెటిల్ చేయాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నఈ ఒకనాటి యాక్షన్ హీరో నిన్న ఒకప్రముఖ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇండస్ట్రీ వారసత్వం పై కొన్ని షాకింగ్ కామెంట్స్ చేసాడు. 

 

ఒక హీరో కొడుకు లేదా కూతురు అయినంత మాత్రాన వారికి అవకాశాలు వస్తాయి అనుకోవడం అత్యాశ అంటూ కామెంట్ చేసాడు. ప్రస్తుతం అర్జున్ తన కూతురు ఐశ్వర్యకు హీరోయిన్ గా తెలుగులో అవకాశాలు ఇప్పించడం కోసం చాలా ప్రయత్నాలు  చేస్తున్నాడు. వాస్తవానికి అర్జున్ కు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న పరిచియాలు రీత్యా తన కూతురుకి అవకాశాలు ఇప్పించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నా ఆప్రయత్నాలకు సరైన స్పనదన రావడంలేదని వార్తలు వస్తున్నాయి.   


దీనికితోడు ఐశ్వర్య  టాలీవుడ్ లో హీరోయిన్ గా నిలదొక్కుకునేందుకు తీవ్రంగా ప్రయత్నాలు  చేస్తున్నా ఆమెకు అవకాశాలు రాకపోవడం ఇండస్ట్రీ హాట్ న్యూస్ గా మారింది.  స్టార్ హీరో కూతురు అవ్వడం వల్ల ఐశ్వర్యకు ఛాన్స్ లు వస్తాయని ఆమె అనుకున్నా ఆమెను టాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ లైట్ గా తీసుకోవడం  షాకింగ్ న్యూస్  గా మారింది.  


వాస్తవానికి ఐశ్వర్య తెలుగులో ఎంట్రీ ఇచ్చేందుకు తెలుగు నేర్చుకున్నప్పటికీ ఆమెతో నటించేందుకు చాలామంది హీరోలు ఇష్టపడటం లేదని తెలుస్తోంది. ఈ పరిస్థితులు అన్నీ అర్జున్ దృష్టి వరకు రావడంతో నిన్నటి ఇంటర్వ్యూలో అతడు మాట్లాడుతూ కేవలం వారసత్వం ఉన్నంత మాత్రాన ఎవరు ఇండస్ట్రీలో హీరోలుగా హీరోయిన్స్ గా మారిపోలేరు అంటూ తన బాధను పరోక్షంగా తెలియచేసాడు అనుకోవాలి. సాధారణంగా హీరోల కొడుకులు హీరోలుగా మారడం సులువు కాని హీరోల కూతుళ్ళు హీరోయిన్స్ గా మారడం కష్టం అన్న విషయం ఇప్పటికైనా అర్జున్ కు అర్థమై ఉండాలి..  
     

 

మరింత సమాచారం తెలుసుకోండి: