కరోనా సమస్యలు లాంటివి ఎన్నిఎదురైనా ఖచ్చితంగా ‘ఆర్ ఆర్ ఆర్’ ను వచ్చే ఏడాది జనవరి 8కి విడుదల చేసితీరాలి అన్న పట్టుదలలో రాజమౌళి ఉన్నాడు. అయితే సుమారు 350 కోట్ల పై చిలుకు బడ్జెట్ ఈమూవీ పై పెడుతున్న పరిస్థితులలో కరోనా ఎఫెక్ట్ వల్ల దిగజారిపోయే ఆర్ధికపరిస్థితులు ‘ఆర్ ఆర్ ఆర్’ మార్కెట్ పై కూడ ప్రభావం చూపెడతాయా అన్నభయాలు రాజమౌళిని వెంటాడుతున్నట్లు టాక్. 


దీనితో ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీ ప్రాజెక్ట్ కు మరింత మార్కెట్ క్రియేట్ చేయడానికి ఈమూవీలో తమిళ సూపర్ స్టార్ విజయ్ కి కూడ ఒక ప్రత్యేక పాత్రను క్రియేట్ చేస్తే ఎలా ఉంటుంది అన్న కోణంలో ఇప్పుడు రాజమౌళి ఆలోచనలు ఉన్నట్లు టాక్. ఈ ఆలోచనలకు అనుగుణంగా ప్రస్తుతం రాజమౌళి తనతండ్రి రచయిత విజయేంద్ర ప్రసాద్ తో చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 


తమిళ ఫిలిం ఇండస్ట్రీలో విజయ్ కి ఉన్న మ్యానియా రీత్యా ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీ ప్రాజెక్ట్ లో విజయ్ కూడ చేరితే ఆమూవీ ఓపెనింగ్స్ తమిళనాడులో కూడ భారీస్థాయిలో రావడమే కాకుండా ఈమూవీ మార్కెట్ తమిళనాడులో బాగా పెరుగుతుంది అన్న ఆలోచనలలో ప్రస్తుతం రాజమౌళి ఉన్నట్లు తెలుస్తోంది. దీనికితోడు ఈమూవీకి సంబంధించి హీరోయిన్ పాత్ర పోషిస్తున్న అలియా భట్ డేట్స్ సమస్యల రీత్యా ఆమె పాత్ర బాగా తగ్గిపోతోంది.


దీనితో ఈమూవీ కథలో మార్పులు చేసి విజయ్ ని కూడ ఎంటర్ చేస్తే ఈమూవీకి చరణ్ జూనియర్ లు ప్రధాన హీరోలు అయితే ప్రత్యేక పాత్రలలో నటించబోయే అజయ్ దేవగణ్ విజయ్ లు అదనపు ఆకర్షణ అవుతారు అని రాజమౌళి వ్యూహం అని అంటున్నారు. దీనికితోడు కరోనా దెబ్బవల్ల షూటింగ్ లు అన్నీ ఆగిపోవడంతో ఈమూవీ కథలో మరిన్ని మార్పులు చేర్పులు చేసే విషయమై రాజమౌళికి బాగా సమయం చిక్కింది అన్నమాటలు వినిపిస్తున్నాయి.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: