కన్నడ భామ రష్మిక మందన్న తెలుగులో కూడా సూపర్ ఫామ్ లో ఉంది. ఛలో సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు ఆ సినిమాతో హిట్ అందుకుని ఆ తర్వాత గీతా గోవిందంతో కూడా సూపర్ హిట్ కొట్టింది. ఈ ఇయర్ సంక్రాంతికి సూపర్ స్టార్ మహేష్ తో సరిలేరు నీకెవ్వరు సినిమాతో మరో హిట్ తన ఖాతాలో వేసుకున్న రష్మిక వరుస ఛాన్సులతో దుమ్ము దులిపేస్తుంది. తెలుగు లో సూపర్ పాపులారిటీ తెచ్చుకున్న ఈ అమ్మడు లేటెస్ట్ గా తమిళ ఆఫర్లు అందుకుంటుంది. కార్తితో ఒక సినిమా చేస్తున్న రష్మిక మరిన్ని అవకాశాలు పట్టేస్తుంది. 

 

అయితే తమిళంలో అమ్మడు చేసిన సినిమా ఒక్కటి కూడా రిలీజ్ కాకపోయినా అక్కడ రష్మికకు మంచి క్రేజ్ ఉంది. అందుకే కోలీవుడ్ యువ హీరో ఏకంగా తన క్రష్ రష్మిక అనేస్తున్నాడు. తమిళ యువ హీరో హరీష్ కళ్యాణ్ బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ విక్కీ డోనర్ రీమేక్ ధారాళ ప్రభుతో క్రేజ్ తెచ్చుకున్నాడు. మార్చి 13న రిలీజైన ఆ సినిమాకు పాజిటివ్ టాక్ రాగా లాక్ డౌన్ వల్ల సినిమా ఆపేశారు. 

 

ఇక 21 రోజుల లాక్ డౌన్ టైం లో ధారాళ ప్రభు డిజిటల్ స్ట్రీమింగ్ లో వచ్చింది. ఈ సినిమా హీరో హరీష్ కళ్యాణ్ లేటెస్ట్ గా తన ఫ్యాన్స్ తో చాటింగ్ చేశాడు. అందులో భాగంగా తన బిగ్ క్రష్ ఎవరని అడిగితే రష్మిక మందన్న అని చెప్పాడు హరీష్. మరి మనోడు అలా చెప్పడంతో తెలుగు, కన్నడ లో ఉన్న రష్మిక ఫ్యాన్స్ హరీష్ కళ్యాణ్ ను ఫాలో అవుతున్నారు. ఒకవేళ తమిళంలో ఆమె చేస్తా అంటే హరీష్ కళ్యాణ్ హీరోగా చేస్తున్న సినిమాకు ఆమెను తీసుకోవాలని ప్రెజర్ చేస్తాడేమో అని కోలీవుడ్ టాక్.   రష్మిక ఒప్పుకోవాలే కాని అతను ఎగిరి గంతేసేలా ఉన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: