సల్మాన్ ఖాన్... దేశంలో చాలా మందికి పరిచయం అవసరం లేని పేరు ఇది. దీనికి కారణం ఆయన నటన, పరివర్తన అని చెప్పుకోవచ్చు. అంతే కాదు బాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరు అంటే అందరూ ఒకే ఒక్క ఆన్సర్ సల్మాన్ ఖాన్. సల్మాన్ ఖాన్ 50 సంవత్సరాలు ఉన్నప్పటికీ ఇంతవరకు తాను వివాహం చేసుకోలేదు. తన కెరియర్ లో ఆయన  ప్రేమ వ్యవహారాలు నడిపాడని వార్తలు వచ్చినా అవి పెళ్లి పీటల వరకు వెళ్లలేదు అని చెప్పవచ్చు.

 

 


అయితే ఇక అసలు విషయానికి వస్తే... సల్మాన్ ఖాన్ ట్విట్టర్ ఖాతాలో అఫీషియల్ గా 40 మిలియన్ల ఫాలోవర్స్ ని సంపాదించుకున్న మూడవ ఇండియా సెలబ్రిటీగా తను అవతరించాడు. ఇంతవరకు ట్విట్టర్లో ఇంత ఫాలోయింగ్ ఉన్న మొదటి ఇద్దరు ఎవరు అంటే భారత దేశ ప్రధాని నరేంద్ర మోడీ, అలాగే రెండో స్థానంలో బిగ్ బి అమితాబ్ బచ్చన్. వీరిద్దరూ మొదటి రెండు స్థానాలను ఆక్రమించారు. అయితే ఇప్పుడు వారి తరువాత సల్మాన్ ఖాన్ ఒక్కడే 40 మిలియన్ల ఫాలోవర్స్ ని చేరుకొని మూడో స్థానంలో నిలిచాడు.


దీన్ని బట్టి తెలుస్తుంది సల్మాన్ ఖాన్ అతని ఫాలోయింగ్. అయితే ఈ మధ్య సల్మాన్ ఖాన్ తాను నటించబోతున్న 3 సినిమా పేర్లను తెలిపాడు. కబీ ఈద్ కబీ, దివాలి, బుల్బుల్ మ్యారేజ్ హాల్, అలాగే కిక్ - 2 ల గురించి చెప్పాడు. అలాగే ప్రస్తుతం ఆయుష్ శర్మతో మరో సినిమాని తెరకెక్కించబోతున్నాడు. అయితే ఈ సినిమా వచ్చే సంవత్సరం లో సెట్స్ పైకి వెళ్తాయి అని చెప్పవచ్చు. ఏదిఏమైనా సోలమన్ ఖాన్ దేశంలో ట్విట్టర్ ఖాతాకు సంబంధించి మూడో స్థానాన్ని సంపాదించడం నిజంగా అభినందించదగ్గ విషయం. దీన్ని బట్టే తెలుస్తుంది సల్మాన్ ఖాన్ అంటే బాలీవుడ్ లో ఎంత క్రేజ్ ఉందో.

మరింత సమాచారం తెలుసుకోండి: