ప్రస్తుతం బుల్లితెరపై హైపర్ ఆది కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జబర్దస్త్ లో ఒక సాదా సీదా కంటెస్టెంట్ గా కెరియర్  ప్రారంభించిన హైపర్ ఆది ఆ తర్వాత స్క్రిప్ట్ రైటర్గా ఆ తర్వాత వేగంగా టీం లీడర్ గా... ఆ తర్వాత జబర్దస్త్ షో లోనే కమెడియన్ గా మారిపోయాడు. ప్రస్తుతం కేవలం హైపర్ ఆది స్కిట్ కోసమే జబర్దస్త్ చూసే ప్రేక్షకులు ఎంతో మంది. ఇలా  హైపర్ ఆది ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుని  తన కెరీర్లో దూసుకుపోతున్నాడు. మరోవైపు స్క్రిప్ట్ రైటర్ గా కూడా తన సత్తా చాటుకున్నాడు. ప్రస్తుతం ఈ టీవీలో ప్రసారమయ్యే దాదాపు అన్ని ప్రోగ్రాములకూ హైపర్ ఆది స్క్రిప్ట్ రాస్తాడు అన్న విషయం అందరికి తెలిసిందే.

 

 

 అయితే జబర్దస్త్ లోకి అదిరే అభి టీమ్ లోకి కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చినా హైపర్ ఆది ఆ తర్వాత ఏకంగా టీం లీడర్ గా మారిపోయాడు. ఈటీవీ లో ప్రసారమయ్యే ఢీ లో  కూడా టీం లీడర్ గా చేస్తూ  మరింత క్రేజ్ సంపాదిస్తున్నాడు హైపర్ ఆది. ఇక ఏకంగా వర్షిణితో  కలిసి లవర్ బాయ్ ఇమేజ్ ను కూడా సంపాదిస్తున్నాడు. అయితే జబర్దస్త్ కి  ఎంట్రీ ఇచ్చిన తర్వాత హైపర్ ఆది ఎంతో క్రేజ్ సంపాదించి అటు ఫైనాన్షియల్ కూడా బాగానే డబ్బులు వెనకే mసుకున్న విషయం తెలిసిందే. అయితే ఒకవేళ హైపర్ ఆది జబర్దస్త్ కి రాకపోయి ఉంటే అతని రేంజ్ వేరు ఉండేది అనే టాక్ కూడా వినిపిస్తోంది. 

 

 

 జబర్దస్త్ కి రాకముందు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పని చేశారు హైపర్ ఆది. అయితే బీటెక్ లో  మెరిట్ స్టూడెంట్ అయిన హైపర్ ఆది ఒకవేళ జబర్దస్త్ కి రాకుండా సాఫ్ట్వేర్ రంగం లోనే కొనసాగి ఉంటే పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యే వాడిని ఒకానొక సమయంలో చెప్పుకొచ్చాడు. జబర్దస్త్ ముందు తాను చేసిన జాబ్ లో మంచి సాలరి  ప్యాకేజీని ఇచ్చేందుకు కూడా కంపెనీలు ముందుకు వచ్చాయని సన్నిహితులు చెబుతున్నారు. అంటే ఒక వేళ హైపర్ ఆది జబర్దస్త్ కి రాకపోవయి ఉంటే కెరీర్ పరంగా బాగానే సెట్ అయ్యే వాడిని టాక్ వినిపిస్తోంది. మహర్షి సినిమాలో మహేష్ బాబు స్థాయిలో సాఫ్ట్వేర్ రంగంలో హైపర్ ఆది బాగా  పేరు తెచ్చుకునే వాడని జబర్దస్త్ ద్వారా ప్రస్తుతం సాఫ్ట్వేర్ రంగానికి దూరం కావడంతో అది మిస్ అయ్యాడు అంటూ అభిమానులు అనుకుంటున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: