ప్రస్తుతం నటి జ్యోతిక అంశం ఎక్కడ చూసినా వినపడుతున్న విషయం తెలిసిందే.ఓ  అవార్డు ఫంక్షన్లో జ్యోతిక చేసిన వ్యాఖ్యలపై ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది. కొంతమంది జ్యోతిక పై విమర్శలు చేస్తూ ఉంటే ఇంకొంతమంది జ్యోతిక ను సమర్థిస్తూ వస్తున్నారు. ఇంతకీ అసలు ఏం జరిగింది అంటారా... ఓ అవార్డు ఫంక్షన్లో జ్యోతిక ప్రధాన పాత్రలో నటించిన రాచ్ఛసి (2019) సినిమాకు గాను ఉత్తమ నటిగా జ్యోతిక అవార్డును అందుకున్నారు. ఈ  అవార్డును  నటి సిమ్రాన్ చేతుల మీదుగా అందుకున్నారు జ్యోతిక. అయితే రాచ్చాసి  సినిమాలో  ఆసుపత్రులు పాఠశాలల  దుస్థితి గురించి ముఖ్యంగా ప్రజలందరికీ అవగాహన కల్పించే విధంగా ఉంటుంది. అయితే ఈ అవార్డు ఫంక్షన్ లో మాట్లాడిన జ్యోతిగా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 

 

 

 

 తాను ఈ సినిమా షూటింగ్ కి తంజావూరు వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందినది ఉందని ఇక్కడికి వచ్చిన వారు ఆలయానికి  వెళ్లకుండా ఉండరు అని అక్కడివారు చెప్పారు అని తెలిపింది.  అదే సమయంలో ఓ రోజు అక్కడి స్థానిక స్కూల్ కు  షూటింగుకి వెళ్లినప్పుడు ఆ స్కూల్ దుస్థితి చూసి ఆశ్చర్యపోయాను అంటూ చెప్పింది . కనీస మౌలిక సదుపాయాలు లేవని కనీసం పిల్లలు చదువుకోవడానికి సరైన వస్తువులు కూడా లేవు అంటూ జ్యోతిక తెలిపింది. అయితే దేవాలయాలను నిర్వహించటానికి ఎన్నో  డబ్బులు వెచ్చిస్తారని అంతేకాకుండా వాటికి పెయింటింగ్ లాంటి వేయడానికి కూడా భారీగానే డబ్బులు ఖర్చు చేస్తారని అలాంటిది ఆస్పత్రులు మంచి చేయడానికి ఆ డబ్బులు ఉపయోగిస్తే బాగుంటుంది అంటూ జ్యోతిక వ్యాఖ్యానించడం పెద్ద దుమారమే రేపింది. 

 

 

 జ్యోతిక వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పెద్ద చర్చ మొదలైంది. కేవలం దేవాలయాలనే ఎందుకు టార్గెట్ చేస్తారని మసీదులు చర్చిలను  ఎందుకు టార్గెట్ చేయరు అని కొందరు అంటుంటే... జ్యోతిక మేడం చెప్పింది వాస్తవమే కదా ఆసుపత్రులు స్కూళ్లు కారణంగానే కదా దేశం బాగుపడుతుంది కొంతమంది సమర్ధిస్తున్నారు. ఏకంగా కొంతమంది మతగురువులు సైతం జ్యోతిక వ్యాఖ్యలను ఖండిస్తున్నారు . ఈ నేపథ్యంలో జ్యోతిక భర్త సూర్య జ్యోతిక కు సపోర్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. జ్యోతిక కాంట్రవర్సీలో జ్యోతిక కు సూర్య సపోర్ట్ చేస్తూ జ్యోతిక వ్యాఖ్యలు కరెక్టే అంటున్నారు అంటూ టాక్ వినిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: