2013వ సంవత్సరంలో విడుదలైన మల్టీ స్టారర్ మూవీ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు భారీ హిట్టయిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రంలో మహేష్ బాబు సోదరుడిగా వెంకటేష్ నటించాడు. ప్రకాష్ రాజ్ జయసుధ వీళ్లిద్దరి తల్లిదండ్రుల పాత్రలో నటించారు. ఈ చిత్రానికి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించగా... మిక్కీ జే మేయర్ అద్భుతమైన సంగీతాన్ని అందించాడు. ఈ మూవీ మొత్తం రేలంగి మావయ్య(ప్రకాష్ రాజ్) ఫ్యామిలీ చుట్టూ తిరుగుతూ ఉంటుంది.


రేలంగి మామయ్యకు ఇద్దరు కొడుకులు కాగా ఒకరి పేరు చిన్నోడు ఒకటే పేరు పెద్దోడు. పెద్దోడు ఏమో బాగా ఎమోషనల్ గా ఉంటాడు. అందరితో కలిసిపోయే మనస్తత్వం ఉంటుంది. చిన్నోడెమో అన్ని లైట్ గా తీసుకుంటూ... అందరితో వెంటనే కలిసిపోతాడు. రేలంగి మామయ్య బంధువులు వాళ్ళకి సంపద తక్కువగా ఉందని చులకన భావంతో చూస్తుంటారు. కానీ రేలంగి మామయ్య మానవతా విలువలతో బతుకుతారే తప్ప డబ్బు సంపాదించడానికి ఎక్కువగా ఆసక్తి చూపరు. ఈ విధంగా నడిచే ఫ్యామిలీ డ్రామా మూవీ లో ఎన్నో మనసును హత్తుకునే సన్నివేశాలు చూపించారు. 50 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కగా... బాక్సాఫీస్ వద్ద 86 కోట్ల పైచిలుకు వసూలు చేసింది.


ఈ చిత్రంలో వెంకటేష్ మహేష్ బాబుల మధ్య కొనసాగే ప్రతి ఒక్క సీన్ అందరికీ ఇప్పటికీ గుర్తుందంటే... వారు ఎంత సహజంగా నటించారో అర్థమవుతుంది. అంజలి సమంత అక్కినేని కూడా ఈ చిత్రంలో అద్భుతంగా నటించి తెలుగు ప్రేక్షకులను బాగా అలరించారు. నెగెటివ్ క్యారెక్టర్ లో నటించిన రావు రమేష్ చెప్పిన డైలాగులు అదిరిపోయేలా ఉన్నాయ్ అని చెప్పుకోవచ్చు. ఈ సినిమా తర్వాత రావు రమేష్ కి పదుల సంఖ్యలో సినీ అవకాశాలు వచ్చాయంట. ఏది ఏమైనా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లో నటించిన ప్రతి ఒక్కరికి బాగా గుర్తింపు వచ్చింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: