పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాల్లో నటిస్తూనే రాజకీయాల్లో రాణిస్తారు. తన సోదరుడు మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ ద్వారా రాజకీయ రంగంలోకి అడుగు పెట్టిన పవన్ కళ్యాణ్ కి చేదు అనుభవమే మిగిలింది. దాంతో చిరంజీవి రాజకీయాలకు స్వస్తి చెప్పాడు కానీ పవన్ కళ్యాణ్ మాత్రం నిర్విరామంగా పట్టువదలని విక్రమార్కుడిలా రాజకీయాల్లో కొనసాగుతూ ప్రజల సమస్యలపై పోరాడుతున్నాడు. తన సొంత పార్టీ ఎమ్మెల్యేలే తనని వదిలి వెళ్ళిపోతే... ఎటువంటి భయం బెరుకు లేకుండా ఎప్పటికైనా ప్రజల్లో నమ్మకాన్ని నింపి ప్రజా నాయకుడిని అవుతానని పవన్ కళ్యాణ్ ముందుకు కొనసాగుతున్నాడు. కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు భారతదేశంలో లాక్ డౌన్ అమలు చేయగా... కరోనా పోరుపై తెలుగు రాష్ట్రాల సీఎంలకు రూ. 2 కోట్ల రూపాయలను ప్రకటించి... తనకు ప్రజల సంక్షేమమే ముఖ్యమని చెప్పకనే చెప్పాడు. ఐతే ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ రాజకీయ జీవితం పై ఒక సీనియర్ హీరో సంచలన కామెంట్స్ చేశాడు.


వివరాలు తెలుసుకుంటే... సీనియర్ నటుడు మురళీ మోహన్ ఒక ఇంటర్వ్యూ లో పాల్గొని పవన్ కళ్యాణ్ రాజకీయ జీవితం పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆయన మాట్లాడుతూ... సినిమా వాళ్ళు రాజకీయ రంగంలో రాణిస్తారు అని చెప్పలేము. అప్పట్లో నందమూరి తారక రామారావు కి తెలుగు ప్రజలందరూ నీరాజనం పలికారు కానీ... కొన్నేళ్ల క్రితం రాజకీయ రంగ ప్రవేశం చేసిన మెగాస్టార్ చిరంజీవికి ప్రజలందరూ వ్యతిరేకత చూపారు. అతన్ని ఘోరాతి ఘోరంగా ఓడిపోయేలా చేశారు. పవన్ కళ్యాణ్ కూడా రాజకీయ రంగంలో రాణించలేకపోయాడు. గత ఎన్నికలలో బాధా కలిగించేలా ఓడిపోయాడు. అయినా కూడా తనలో ఫైర్ అలానే ఉండిపోయింది. అందుకే ఆయన ఎప్పటిి కైనా ఉన్నత స్థాయికి ఎదుగుతారు అని నాకు అనిపిస్తుంది' అని ఆయన చెప్పుకొచ్చాడు.


ఆయన ఇంకా మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పట్లో ఎన్నికలు రావు. ఎన్నికల సమయం రావాలంటే ఇంకా నాలుగు ఏళ్ళు పడుతుంది. అందుకే ఇప్పుడు పవన్ కళ్యాణ్ రాజకీయ రంగాల్లో నిక్కచ్చిగా కొనసాగడం వలన ఎవరికి ఉపయోగం లేదు. మళ్లీ పార్టీ సాగించేందుకు పవన్ కళ్యాణ్ తన చేతులారా డబ్బులు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ సాఫీగా సాగిపోవాలంటే పవన్ కళ్యాణ్ కంపల్సరిగా డబ్బు సంపాదించాలి. అందుకే ఆయన సినిమాలు చేస్తున్నాడు. రాజకీయ రంగంలో సినిమా రంగంలోనూ కళ్యాణ్ బాబు రాణించాలని తాను కోరుకుంటున్నట్టు ఆయన చెప్పుకొచ్చాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: