మూడు సక్సెస్ ఫుల్ సీజన్లను కంప్లీట్ చేసుకున్న బిగ్ బాస్ తెలుగు నాల్గవ సీజన్ కు రెడీ అవుతుంది. అసలైతే ఇప్పటికే కంటెస్టెంట్స్ ఎవరన్నది నిర్ణయించుకోవాల్సింది. కానీ కరోనా లాక్ డౌన్ కారణంగా ఇంకా ఆ ప్రాసెస్ స్టార్ట్ చేయలేదని తెలుస్తుంది. అయితే కొంతమందిని ఫోన్ లో టచ్ లోకి తీసుకునే  ప్రయత్నం చేసినా వారు సారీ ఇంట్రెస్ట్ లేదని చెబుతున్నారట. బిగ్ బాస్ నిర్వాహకులకు ఇదో తలనొప్పిగా మారిందని తెలుస్తుంది.


తెలుగులో కంటెస్టెంట్స్  ఎప్పుడు కాంప్రమైజ్ కావాల్సి వస్తుంది. అయితే ఈసారి స్టార్ కంటెస్టెంట్స్ ను తీసుకురావాలని అనుకున్నారు తీరా చూస్తే అసలుకే మోసం వచ్చేలా ఉంది. కంటెస్టెంట్స్ ఎవరు బిగ్ బాస్ షో మీద అంత ఆసక్తి కనబరచడం లేదని అంటున్నారు. ఆల్రెడీ లాక్ డౌన్ కారణంగా నలభై రోజుల పాటు ఇంట్లోనే ఉన్నాం కాబట్టి ఇల్లే బిగ్ బాస్ హౌజ్ లా  ఇబ్బంది పడ్డారట. అందుకే బిగ్ బాస్ ఆఫర్ రిజెక్ట్ చేస్తున్నారట. ఇంతకుముందు కొద్దిగా ఇంట్రెస్ట్ చూపిన కంటెస్టెంట్స్ సైతం ఎక్కువ రెమ్యునరేషన్ సరే కష్టమని అంటున్నారట. 


అదేకాకుండా బిగ్ బాస్ సీజన్ 1 నుండి 3 వరకు గెలిచిన వారు ఆ షోలో పాల్గొన్న వారు ఎవరు పెద్దగా కెరియర్ పీక్స్ లోకి వెళ్ళింది లేదు. బిగ్ బాస్ నడిచినంత కాలం క్రేజ్ ఉంటుంది. ఆ తర్వాత అసలు జనాలు వాళ్ళని పట్టించుకోవడం లేదు. మొదటి సీజన్ విజేత శివ బాలాజీ, రెండో సీజన్ కౌశల్, మూడవ సీజన్ రాహుల్ ఇలా ముగ్గురు విజేతలు గెలిచినా ఆ కొద్దిరోజులు ఏదో హడావిడి చేశారు తప్ప పెద్దగా సాధించింది ఏది లేదు. అందుకే కంటెస్టెంట్స్ ఈ విషయంలో ఆలోచనలో పడ్డారని తెలుస్తుంది. మరి ఈ సీజన్ లో ఎవరెవరు ఉంటారన్నది చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: