సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరో హీరోయిన్ల మధ్య మంచి స్నేహ బంధం ఏర్పడుతుంది అన్న విషయం తెలిసిందే. ఒక సినిమాలో నటిస్తే సరే రెండు మూడు సినిమాల్లో నటించారు అంటే వారి మధ్య స్నేహ బంధం మరింత బలపడుతుంది. ఇక వారి ఇద్దరి స్నేహం కాస్త ప్రేక్షకులకు తెగ ఆకర్షిస్తూ వస్తుంది . ఇలా తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రేక్షకుల  ఫెవరెట్  గా మారిపోయిన స్నేహ బంధం ఏది అంటే అందరికీ టక్కున గుర్తొచ్చేది ప్రభాస్ అనుష్క. 

 

 ఎన్నో ఏళ్ల నుంచి వీరిద్దరి మధ్య స్నేహబంధం కొనసాగుతూ వస్తోంది.  వీరిద్దరూ అన్నింటికంటే వారి స్నేహమే ముఖ్యం అన్నట్లుగా ఉంటారు. ఇక వీరిని చూసినప్పుడల్లా అభిమానులు తెగ మురిసిపోతుంటారు. ఇప్పటికే వీరిద్దరూ కలిసి పలు సినిమాల్లో నటించారు కూడా. ఇంకా టాలీవుడ్ సెన్సేషనల్ అయినా బాహుబలి సినిమాలో  కూడా ఇద్దరూ జంటగా నటించారు. దీంతో వీరిద్దరి మధ్య ఉన్న మంచి స్నేహబంధాన్ని కాస్త చాలామంది ప్రేమ అనుకున్నాడు. 

 

 

 అనుష్క ప్రభాస్ మధ్య ప్రేమ కొనసాగుతుందని  వీరిద్దరు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారనే టాక్  ఎన్నో రోజుల నుంచి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అయితే తామిద్దరం మంచి స్నేహితులం అని కానీ ప్రేమ లాంటిది ఏదీ లేదని వీరిద్దరు ఎప్పటికప్పుడు క్లారిటీ ఇస్తున్నప్పటికీ కూడా అటు ప్రేక్షకులకు మాత్రం వీరిద్దరి మధ్య కేవలం స్నేహబంధం మాత్రమే కాదు స్నేహానికి మించిన బంధం ఏదో ఉంది అని అనుకుంటున్నారు. అందుకే వీరిద్దరి మధ్య స్నేహ బంధం ఉంది కానీ... అది అంతకు మించి ప్రేమ కూడా ఉండి అంటున్నారు. .

మరింత సమాచారం తెలుసుకోండి: