పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. జనసేన పార్టీని ముందుకు నడిపించేందుకు డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో మూడు సినిమాలలో హీరోగా నటించేందుకు సిద్ధ మయ్యాడు పవన్ కళ్యాణ్. అమితాబచ్చన్ నటించిన పింక్ కి రీమేక్ గా పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాలో నటిస్తున్నాడన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని మినహాయించే ట్రీస్ జాగర్లమూడి తో కలిసి విరూపాక్ష చిత్రంలో నటించేందుకు ఓకే చెప్పేసిన పవన్ హరీశ్ శంకర్ సినిమాలో కూడా నటించేందుకు పచ్చజెండా ఊపాడు. అయితే ఈ మూడు సినిమాలను మినహాయించి మరో రెండు రీమేక్ చిత్రాలలో పవన్ కళ్యాణ్ నటించేందుకు సిద్ధ పడుతున్నట్టు సినీ వర్గాల నుండి టాక్ వినిపిస్తుంది. అందులో ఒకటి సాయిధరమ్ తేజ్ తో కలిసి పవన్ నటించనుండగా... మరొక రీమేక్ చిత్రం గురించి సమాచారం తెలియాల్సి ఉంది. అయితే పవన్ కళ్యాణ్ ఎక్కువగా రీమేక్ సినిమాలో నటించడానికి ఎందుకు శ్రద్ధ చూపుతున్నారనేది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. 


రీమేక్ సినిమాలు తెరకెక్కిస్తున్నారు అంటే సులువుగా డబ్బు సంపాదించడం కోసమేనని చాలామంది భావిస్తారు. ఆల్రెడీ హిట్ అయిన సినిమాని అచ్చం అలాగే తమ భాష నేటివిటీకి తగ్గట్టు తీసి ఎక్కువ శ్రమ లేకుండా డబ్బులు సంపాదించిన సినీ ప్రముఖులు ఎంతోమంది ఉన్నారు. అంతెందుకు పవన్ కళ్యాణ్ తన సినీ కెరీర్లో ఎన్నో రీమేక్ చిత్రాల్లో నటించి డబ్బులతో పాటు పేరుప్రఖ్యాతులను సంపాదించాడు. అదే ఒకవేళ పవన్ కళ్యాణ్ ఫైట్ తెలుగు మూవీస్ లో నటించినట్లయితే తన సినిమా కెరీర్ మరోలా ఉండేది. రీమేక్ సినిమాలను మాత్రమే నమ్ముకున్న పవన్ కళ్యాణ్ ఇప్పటివరకైతే మోస పోలేదు. 


హాలీవుడ్ ఫిలిం డైరెక్టర్లు నిర్మాతలు కూడా ఇతర దేశాల సినిమాలను రీమేక్ చేస్తూ తక్కువ బడ్జెట్ తో ఎక్కువ డబ్బులు సంపాదిస్తుంటారు. అలాగే ఈ సినిమాను మళ్లీ తెరకెక్కించడానికి అంతా ఎక్కువ సమయం కూడా పట్టదు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తన సినిమాలను తక్కువ సమయంలో పూర్తి చేసి ఎక్కువ డబ్బులు ఎలా సంపాదించాలి అని అనుకుంటున్నారు. అందుకే ఇప్పటికే మూడు రీమేక్ సినిమాలలో నటించేందుకు సిద్దమయ్యాడు. అలాగే ఈ సినిమాలో నటించినందుకు గాను తాను దాదాపు 50 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని తెలుస్తుంది. ఏది ఏమైనా రెండు సంవత్సరాల కాలంలో ఐదు సినిమాల్లో పవన్ కళ్యాణ్ నటిస్తే రూ. 200 కోట్ల పైచిలుకు సంపాదించగలడు. అవి తన పార్టీ ని సమర్థవంతంగా ముందుకు నడిపేందుకు ఉపయోగపడతాయని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: