తెలుగు చిత్ర పరిశ్రమలో దర్శక ధీరుడు రాజమౌళికి ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. ప్రస్తుతం ఓటమెరుగని దర్శకుడిగా.. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తెలుగు దర్శకుడిగా గుర్తింపు పొందారు రాజమౌళి. తనదైన శైలిలో సినిమాలను తెరకెక్కిస్తు  ఒక గొప్ప ఆదర్శంగా మారిపోయారు. ప్రస్తుతం రాజమౌళిసినిమా తెరకెక్కించిన అది ఇండస్ట్రీ హిట్ గా మారిపోయి ఎన్నో సంచలనాలను సృష్టిస్తుంది అన్నది ప్రేక్షకుల భావన. ఇప్పటివరకు ఎన్నో సినిమాలు తెరకెక్కించి ఎన్నో విజయాలను అందుకున్నారు రాజమౌళి. తెలుగు చిత్ర పరిశ్రమలో ఏ దర్శకుడికి సాధ్యంకాని విజయ పరంపరను కొనసాగిస్తూ సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్నారు . తెలుగు చిత్ర పరిశ్రమ అనే పుస్తకంలో ఎన్నో పేజీలు లిఖించుకున్నాడు రాజమౌళి. 

 

 అయితే ఇంటర్నేషనల్ స్టార్ డైరెక్టర్గా ఎదిగిన రాజమౌళి తన సొంతూరు పై మమకారం మాత్రం ఎప్పుడూ మర్చిపోలేదు. పశ్చిమ గోదావరి జిల్లా గోదావరి ఒడ్డున ఉన్నటువంటి కొవ్వూరు రాజమౌళి స్వగ్రామం. రాజమౌళి అక్కడే  జన్మించారు. ఇక రాజమౌళి ఇంటిపేరు కోడూరు వారి. అయితే కొవ్వూరులో కోడూరు వారి ఫ్యామిలీకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ ఫ్యామిలీ నుంచి ఎంతో మంది సినీ రాజకీయ రంగాల్లో రాణిస్తున్నారు. ఇక కొవ్వూరులో ఏకంగా రాజమౌళి ఇంటిపేరు అయినా కోడూరు వారి అనే పేరుతో ఒక వీడి  కూడా ఉంది. కొవ్వూరు లో జన్మించిన రాజమౌళి ఏలూరులోని సర్ సి.ఆర్.రెడ్డి కాలేజీలో ఇంటర్ విద్యను పూర్తి చేశారు.

 


 ఇక ఆ తర్వాత తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకున్న  రాజమౌళి సినిమాల్లోకి ప్రవేశించి టాప్ డైరెక్టర్ గా ఎదిగారు. దర్శకధీరుడు గా మారిపోయారు. అయితే రాజమౌళి ఎంత స్టార్ డైరెక్టర్ గా ఎదిగినప్పటికీ కొవ్వూరు అంటే అమితమైన ప్రేమ ఉంటుంది. ఇప్పటికీ రాజమౌళి బంధువులందరూ కొవ్వూరు లోనే ఉన్నారు. ఇక సమయం దొరికినప్పుడల్లా తన సొంత ఊరికి వెళ్లి సమయం గడుపుతూ ఉంటారు రాజమౌళి. అటు కొవ్వూరు ప్రజలు కూడా తమ ఊరికి చెందిన వ్యక్తి ప్రస్తుతం దేశం  గర్వించదగ్గ దర్శకుడిగా తెలుగు చిత్ర పరిశ్రమలో ఎదిగారు అని గర్వంగా చెప్పుకుంటూ ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: