కొన్ని రోజుల క్రితం మెగా బ్రదర్ నాగబాబు తన ట్విట్టర్లో మహాత్మా గాంధీని హత్య చేసిన నాథూరాం గాడ్సేను గొప్ప దేశభక్తుడిగా అభివర్ణించి ఒక సరికొత్త సంచలనానికి తెరతీసాడు. గాంధీని చంపడం నేరమే అయినా గాడ్సే దేశభక్తిని మాత్రం శంకించవలసిన  అవసరం లేదు అంటూ నాగబాబు చేసిన కామెంట్స్ పెను దుమారాన్ని సృష్టించాయి. ఈ కామెంట్స్ తెలుగు రాష్ట్రాలలో అనేక చర్చలకు దారితీసాయి.

 

ఈ కామెంట్స్ ను కొందరు పవన్ కళ్యాణ్ వ్యతిరేకులు ‘జనసేన’ కు ముడిపెట్టి విమర్శలు చేయడంతో ‘జనసేన’ వర్గాలు రంగంలోకి దిగి నష్ట నివారణ చర్యలు చేపట్టవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి. నాగబాబు చేసే వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని ‘జనసేన’ పార్టీకి సంబంధం లేదని స్పష్టం చేస్తూ జనసేన పార్టీ నిన్న ప్రకటన జారీ చేసింది. అంతేకాదు జనసేన పార్టీలో లక్షలాది కార్యకర్తలు నాయకులు సామాజిక మాధ్యమాల్లో వ్యక్తం చేసే అభిప్రాయాలు వారి వ్యక్తిగతం పార్టీకి ఏమాత్రం సంబంధం లేదు అంటూ మీడియా ద్వారా పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చాడు.

 

అంతేకాదు ప్రజాసేవ తప్ప మరే ఇతర అంశాల జోలికి వెళ్ళవద్దని సున్నితంగా పవన్ తన జనసైనికులకు దిశ నిర్దేశ్యం చేసాడు. ఈ క్లారిటీ వచ్చిన కొద్ది సేపటికి మళ్ళీ నాగబాబు రెట్టించిన ఉత్సాహంతో కరెన్సీ నోట్లపై ఒక్క గాంధీ బొమ్మ మాత్రమే వేయడం కరెక్ట్ కాదని దేశంలో ఎంతోమంది గొప్ప నాయకులు స్వాతంత్ర్య సమరయోధులు ఉన్నారని వారందరి గురించి నేటితరానికి తెలియాలి అంటే ఇండియన్ కరెన్సీ పైసుభాష్ చంద్ర బోస్ అంబేద్కర్ భగత్ సింగ్ చంద్ర శేఖర్ ఆజాద్ లాల్ బహదూర్ పీవీ నరసింహారావు అబ్దుల్ కలాం సావర్కార్ వాజపాయ్ లాంటి మహానుభావుల చిత్రాలను కూడా కరెన్సీ పై ముద్రిస్తే చూడాలని ఉంది అంటూ మరో ట్విట్ చేసాడు. దీనితో నాగబాబు ప్రస్తుతం కొనసాగుతున్న ఈ లాక్ డౌన్ సమయంలో ఇంత అత్యుత్సాహం ఎముడుకు ప్రదర్శిస్తున్నాడు అనేకమంది షాక్ అవుతున్నారు.


ప్రపంచ దేశాల కరెన్సీకి రారాజు లా కొనసాగుతున్న అమెరికన్ డాలర్ పై జార్జి వాషింగ్టన్ బొమ్మ మాత్రమే ఉంటుంది కాని మరేవ్వరి బొమ్మ ఉండదు. అదేవిధంగా ఇంగ్లాండ్ కు సంబంధించిన కరెన్సీ పై ఎలిజిబెత్ రాణి జార్జి చక్రవర్తుల బొమ్మలు మాత్రమే కనిపిస్తాయి. ఒకదేశ కరెన్సీ పై కనిపించే బొమ్మ ఆ దేశ చరిత్రలో ఎన్నటికీ మాహోన్నంతంగా కొనసాగే వ్యక్తికి సంబంధించినది మాత్రమే అవుతుంది. ఇలాంటి సున్నిత విషయాలు తెలిసి కూడ నాగబాబు నాగ బాబు ఇలా మాహాత్ముడుని ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు అన్న విషయం ప్రస్తుతానికి సమాధానం లేని ప్రశ్న..

 

మరింత సమాచారం తెలుసుకోండి: