చాక్లెట్స్ తినని చిన్న పిల్లలు, మందు కొట్టని సినిమా తారలు ఉండరు అంటే ఎవ్వరు నమ్మరు. ఈ కల్చర్ మన దక్షిణాది సినిమా తారలలో కంటే బాలీవుడ్ తారలలో చాల ఎక్కువగా ఉంటుంది. వీకెండ్ పార్టీలు అంటూ ఈ మధ్య చిన్నా పెద్దా అన్న తేడలేకుండా అందరూ పార్టీలలో మందుకొట్టి చిందులేస్తుంటారు.
అయితే ఈ తరహా పార్టీలను తమ ఇళ్ళలోనూ, ఫాంహౌస్ లలోను చాల మంది సెలబ్రిటీలు ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. కానీ ఈ మధ్య యువతరం నటినటులు ఎక్కువగా బార్లలోనూ, పబ్బులలోనోను జరిగే పార్టీలలో కనిపిస్తూ మీడియా కు బుక్ అయి పోతున్నారు.
తాజాగా ముంబైలో జరిగిన ఇటువంటి ఒక పార్టీ వెలుగులోకొచ్చింది. బాలీవుడ్ నుండి టాలీవుడ్ వరకు కొంతమంది యువ తారలందరూ కలిసి ఈ పార్టీ చేసుకున్నారు. ఇందులో ఉన్న నటులు సంగతి ఎలా ఉన్నాకానీ నటీమణులలో సౌత్ హీరోయిన్స్ రీమాసేన్, శ్రియలాంటి సీనియర్ తారలు కూడా ఉండటంతో ఈ విషయం మీడియాకు పెద్ద న్యూస్ గా మారింది. ఇక ఈ పార్టీ లో మందు ఏరులై పారిందని సమాచారం.
అంతేకాకుండా ఒక నాటి మన టాలీవుడ్ టాప్ హీరోయిన్లు రీమాసేన్, శ్రియ పీకల దాకా తాగి.. చిందులేయడంతో పాటు ఓ యువకుడి మీద పడి అతని చొక్కా చించి కసిగా అతగాణ్ణి గోళ్లతో రక్కుతూ నానాయాగీ చేశారట. అయితే ఈ హీరోయిన్లు చేస్తున్న రచ్చను ఆ పబ్ లోని వారంతా ఎంజాయ్ చేసారట. ప్రస్తుతం ఎలాగు బూకింగ్స్ లేవు కాబట్టి శ్రియ రీమా సేన్ లు ఇలా కాలంగడుపుతున్నారు అనుకోవాలి.
మరింత సమాచారం తెలుసుకోండి: