ఇప్పుడు సినిమా మార్కెట్ మీద మన తెలుగు హీరోలకు ఉన్న పిచ్చి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్టార్ హీరో అయితే తమ సినిమా విడుదల అవుతుంది అంటే చాలు మార్కెట్ ఎంత వస్తుంది... తాను ఎంత తీసుకోవాలి అనే దాని మీద ఇప్పుడు ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. అస‌లు కొంద‌రు హీరోలు అయితే క‌థ‌, క‌థ‌నాల‌తో సంబంధం లేదు.. ఏ నిర్మాత ఎక్కువ డ‌బ్బులు ఇస్తానంటే క‌థ‌, ద‌ర్శ‌కుల‌తో సంబంధం లేకుండా సినిమాలు ఒప్పేసుకుంటున్నారు. ఈ లిస్టులో మీడియం రేంజ్ హీరోల నుంచి స్టార్ హీరోల వ‌ర‌కు చాలా మందే ఉన్నారు. పారితోషికం తీసుకుంటూనే దాని మీద ఎక్కువగా దృష్టి పెడుతూ వస్తున్నారు. అయితే దీనిపై భిన్నాభిప్రాయాలు ఎక్కువగా ఉన్నాయి. 

 

ముఖ్యంగా హీరో పారితోషికం తో పాటుగా పైన వచ్చే మార్కెట్ కూడా తీసుకుంటే తాము ఇబ్బంది పడతామనే ఆలోచనలో స్టార్ నిర్మాతలు ఎక్కువగా ఉన్నారని సమాచారం. లాక్ డౌన్ లో తాము ఎక్కువగా నష్టపోయామని ఇప్పుడు ఇది ఫాలో అయితే తమకు బాగా ఇబ్బందిగా ఉంటుందని దయచేసి అర్ధం చేసుకోవాలని హీరోలను నిర్మాతలు కోరుతున్నారు. కాదు కూడదు అంటే మాత్రం సినిమాను అయినా వదలడానికి సిద్డమయ్యారట.

 

ఇటీవల ఓ అగ్ర నిర్మాత మహేష్ బాబు కి ఇదే విషయాన్ని చెప్పినట్టు సమాచారం. అదే విధంగా ప్రభాస్ తో పాటుగా నానీకి కూడా ఇదే విషయాన్ని దర్శక నిర్మాతలు చెప్పారని... తాము నష్టాల్లో ఉన్నాం కాబట్టి రెండు మూడేళ్ళు ఈ విధానం కష్టమే అని చెప్పారట. ఇక అంద‌రి కంటే ముందు ఈ విష‌యంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను ఆద‌ర్శంగా తీసుకోవాలి. ప‌వ‌న్ వ‌కీల్ సాబ్ కోసం త‌న రెమ్యున‌రేష‌న్ భారీగా త‌గ్గించుకున్నాడ‌ట‌. దీనితో హీరోలు కూడా ఇప్పుడు నిర్మాతల మాటను కాదు అనలేక అర్ధం చేసుకుని సైలెంట్ అయ్యారట. మరికొందరు హీరోలకు కూడా ఇదే చెప్తున్నారట.

 

మరింత సమాచారం తెలుసుకోండి: