టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. పూజ హెగ్డే హీరోయిన్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు జాన్ అనేది వర్కింగ్ టైటిల్. ఇటీవల చివరిగా జార్జియా లో కొంత భాగం షూటింగ్ జరుపుకున్న అనంతరం, హఠాత్తుగా కరోనా మహమ్మారి పంజా విసరడంతో సినిమా యూనిట్ అర్ధాంతరంగా షూటింగ్ ముగించుకుని ఇండియాకి తిరిగిరావడం జరిగింది. ప్రభాస్ తల్లిగా బాలీవుడ్ సీనియర్ నటి భాగ్యశ్రీ నటిస్తున్న ఈ సినిమాలో కృష్ణంరాజు ఒక ముఖ్య పాత్రలో నటిస్తుండగా గోపి కృష్ణ మూవీస్, యువి క్రియేషన్స్ సంస్థలు ఎంతో భారీగా ఈ సినిమాని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. 

IHG

కొన్నేళ్ల క్రితం యూరోప్ లో జరిగిన హృద్యమైన ప్రేమకథగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటివరకు అరవై శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్నట్లు టాక్. వాస్తవానికి ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్, టైటిల్ వంటివి ఇటీవల ఉగాది పండుగ సందర్భంగా రిలీజ్ కావలసి ఉండగా, కొన్ని అనివార్య కారణాల వలన అది కుదరలేదని, వీలైనంత త్వరగా టైటిల్, ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేస్తాం అని నిర్మాతలైన యువి క్రియేషన్స్ వారు కొద్దిరోజులు క్రితం తమ సోషల్ మీడియా అకౌంట్స్ లో ఒక పోస్ట్ పెట్టారు. అయితే వారు ఆ పోస్ట్ పెట్టి చాలారోజులు అవడంతో, ఇప్పటివరకు తమ హీరో సినిమాకు సంబంధించి ఒక్క అప్ డేట్ కూడా లేదని, ఇప్పటికే మరోప్రక్క ఆర్ఆర్ఆర్, సర్కారు వారి పాట వంటి సినిమాలు ఈ లాక్ డౌన్ లో కూడా కొంతమేర పబ్లిసిటీ చేసుకుంటూ పోతుంటే యువి క్రియేషన్స్ వారు మాత్రం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తూ తమ హీరో సినిమా గురించి పట్టించుకోవడం లేదని ప్రభాస్ ఫ్యాన్స్ విరుచుకుపడుతూ సోషల్ మీడియా మాధ్యమాల్లో సదరు సినిమా నిర్మాతలైన యువి క్రియేషన్స్ వారిని ఏకేస్తున్నారు. 

 

సినిమా మొదలై ఏడాదిన్నర అవుతున్నా, ఇప్పటివరకు ఒక్క అప్ డేట్ కూడా ఇవ్వకుండా జాప్యం చేయడం ఏంటని, ఇకనైనా కళ్ళు తెరిచి జాన్ కు సంబంధించి ఏదైనా పోస్టర్ కానీ టైటిల్ ఫస్ట్ లుక్ గాని రిలీజ్ చేయాల్సిందే అంటూ నిన్న రాత్రి నుండి పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో పలువురు ప్రభాస్ ఫ్యాన్స్ యువి క్రియేషన్స్ నిర్మాతలపై విరుచుకుపడుతూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా కొద్దిరోజుల క్రితం నుండి ప్రభాస్ ఫ్యాన్స్ చేస్తున్న విజ్ఞాపనలు, కామెంట్స్ యువి క్రియేషన్స్ నిర్మాతలు ఎంతవరకు పట్టించుకుని ఆ సినిమాకు సంబంధించి ఎంతవరకు రాబోయే రోజుల్లో అప్ డేట్స్ ఇస్తారో చూడాలి.....!! 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: